కౌశల్ గురించి నాకెందుకండీ.. ఇక నానినే నోరు విప్పాలి: బాబు గోగినేని

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (10:36 IST)
బిగ్‌బాస్ 2 విజేత కౌశల్‌ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. కౌశల్‌పై బిగ్ బాస్‌లో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు కౌశల్ కౌంటరిచ్చినా ప్రయోజనం లేకపోయింది. అయితే తాజాగా కౌశల్‌పై కామెంట్స్ చేస్తూ బాబు గోగినేని సీన్లోకి వచ్చారు. 
 
బిగ్ బాస్ 2 విజేతగా కౌశల్ నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి కౌశల్ ఆర్మీ కొన్ని రోజులుగా కౌశల్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఎప్పటికప్పుడు కౌశల్ ఖండిస్తూ వచ్చినా ప్రయోజనం అంతంత మాత్రమే. 
 
తాజాగా కౌశల్‌పై గోగినేని ఏమన్నారంటే.. కౌశల్ ఆర్మీ గుట్టు రట్టు అయిన విషయాన్ని గురించి ప్రస్తావించారు. బిగ్‌బాస్ షోలో కౌశల్ గురించి, తన ఆర్మీ గురించి బాబు గోగినేని పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే నాని మాత్రం గేమ్‌ను గేమ్‌లా ఆడాలి అంటూ గోగినేనికి క్లాస్ పీకాడు. కానీ కౌశల్‌పై కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు రివర్స్ అయిన సందర్భంగా ఓటింగ్‌కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో ఓటింగ్‌ను ప్రభావితం చేశారనే అంశంపై నాని స్పందించాలని బాబు గోగినేని డిమాండ్ చేశారు. గతంలో తన వాదనను కొట్టి పారేస్తూ కౌశల్‌ని సమర్థించిన నాని, ప్రస్తుత వివాదంపై వెంటనే స్పందించాలని గోగినేని వ్యాఖ్యానించారు. మరి ఈ వివాదంపై నాని ఏమేరకు స్పందింస్తాడో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments