Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీషకు ఏపి డిజిపి ఊహించని గిఫ్ట్

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:01 IST)
శ్రీకాకుళంలోని కాసిబుగ్గు-పలాసా ప్రాంతంలోని సంపంగిపురంలోని అడవికొట్టూరులోని వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వృద్ధుడు అనాధ శవం పట్ల మానవత్వం చాటిన ఎస్సై శిరీష డీజీపీ డిస్క్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమెకు డీజీపీ డిస్క్ అవార్డును ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా అందజేసి అభినందించారు. పోలీసుల విధి నిర్వహణలో సేవాకార్యక్రమాలు కూడా ఓ భాగమన్న డిజిపి, పోలీసుల సేవానిరతిని ఎస్సై శిరీష ప్రత్యక్షంగా చూపించారని అన్నారు.
 
ఈ సందర్భంగా మహిళా ఎస్సై శిరీష మాట్లాడుతూ... మన సమాజంలో ఆడపిల్ల శవాన్ని మోయడం వ్యతిరేకిస్తారు. కానీ అక్కడి పరిస్థితుల రీత్యా నేను మోయాల్సి వచ్చింది. వృద్ధుడి శవాన్ని వ్యవసాయ క్షేత్రం నుంచి అంబులెన్స్ వాహనం వరకూ మోయాల్సి వచ్చింది. నా తలిదండ్రులు నాకు నేర్పిన సేవాభావం కారణంగానే నేను అలా చేసాను. అది ఈరోజు నాకు ఈ అవార్డు తెచ్చిపెట్టింది. డీజీపీ గారితోపాటు నాకు అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అని అన్నారు.
 
కాగా గత నెల జనవరి 31న కాసిబుగ్గు-పలాసా ప్రాంతంలోని సంపంగిపురంలోని అడవికొట్టూరులోని వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడని పోలీసులకు సమాచారం అందింది. దీనితో కానిస్టేబుళ్లతో పాటు మహిళా ఎస్సై శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధుడి మృతదేహాన్ని తరలించేందుకు ఎస్సై శిరీష స్థానిక గ్రామస్తుల సాయం కోరారు. ఐతే వారు ఆ వృద్ధుడి మృతదేహాన్ని తాకడానికి కానీ కనీసం సహాయం చేయడానికి కానీ ముందుకు రాలేదు.
 
 
ఆమె వృద్ధుడి మృతదేహాన్ని మోసుకెళ్ళడం చూసిన తరువాత, కొంతమంది గ్రామస్తులు ముందుకు వచ్చి సహాయం అందించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అనాధలా మృతి చెందిన ఓ వ్యక్తికి గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు చేసే దిశగా ఒక మహిళా పోలీసు అధికారి చేసిన పనికి నెటిజన్లు ప్రశంసించారు. ఇదంతా డిజిపి గౌతం సవాంగ్ దృష్టికి రావడంతో ఆయన మహిళా ఎస్సై శిరీషను అవార్డును బహూకరించి అభినందించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments