Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాగు చట్టాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్

సాగు చట్టాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (13:31 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా తోమర్‌ శుక్రవారం రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన రైతుల ఆందోళన అంశంపై ఆయన ప్రసంగించారు. 
 
'నల్ల' చట్టాలు అంటూ రైతు సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే వ్యవసాయ చట్టాల్లో నలుపు ఏముందని గత కొన్ని నెలలుగా నేను రైతు సంఘాల నేతలను అడుగుతున్నాను. వాళ్లు చెబితే నేను వాటిని సరిచేస్తాను' అని తోమర్ సభలో ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. కొత్త చట్టాలు అమలైతే మీ భూములు లాక్కుంటారంటూ కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిని కావాలనే రెచ్చగొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒప్పంద వ్యవసాయ చట్టం ద్వారా రైతుల భూములు దోపిడీకి గురవుతాయని చెప్పేలా ఒక్క నిబంధన అయినా ఉందా అని ప్రశ్నించారు. 
 
రైతుల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని తోమర్‌ తెలిపారు. పంటలకు ఉత్పత్తి ఖర్చుల కంటే కనీసం 50శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక అవసరాల కోసం రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించామన్నారు. 
 
"2020లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొవిడ్‌ మహమ్మారి తెచ్చిన ఆంక్షలు ఆర్థిక వ్యవస్థ.. జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే ఆ పరిస్థితులను దేశం కలిసికట్టుగా ఎదుర్కొంది. క్రమశిక్షణతో మహమ్మారిని తరిమికొట్టగలుగుతున్నాం. ప్రజలు.. ప్రభుత్వమే మన దేశ బలం అని చెప్పేందుకు ఆనందంగా ఉంది. కొవిడ్‌ పోరులో భారత్‌ విజయం సాధించింది. ఒకప్పుడు పీపీఈ కిట్లను తయారుచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న మనం.. ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం" అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధి దొరుకుతుందని వస్తే గొడ్డు చాకిరి చేయిస్తున్నారు... డ్రైవర్ల ఆవేదన