Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఢీకొని ఆడ ఏనుగు, గున్న ఏనుగు మృతి-ఇంజిన్ స్పీడ్‌తో..?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (11:39 IST)
రైలు ఢీకొని ఓ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్న ఆ తల్లి బిడ్డలను వేగంగా వస్తున్న రైలు పొట్టన పెట్టుకుంది. అటవీ ప్రాంతం గుండా వెళ్లేటప్పుడు ఇంజన్ స్పీడు తగ్గించాలన్న ఫారెస్ట్ అధికారుల విజ్ఞప్తిని తుంగలో తొక్కి రెండు ఏనుగుల మృతికి కారణమైన రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసారు అటవీ శాఖ అధికారులు. ఇందుకు భారీ మూల్యం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
 
ఏనుగుల మృతికి కారణమైన రైలు ఇంజన్‌ను అసోం అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 27న లుండింగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని రైలు పట్టాలపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఆడ ఏనుగు, ఏడాది వయసున్న గున్న ఏనుగు మృతి చెందాయి. 
 
రైల్వే ప్రాజెక్టులకు సరుకులను తరలించడానికి ఈ రైలును వినియోగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత వేగంగా ప్రయాణించడంతో ఏనుగుల మృతి చెందాయని అసోం అటవీ శాఖ మంత్రి పరిమళ్ శుక్లాబైద్య అన్నారు. ఈ ఘటనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అటవీ శాఖ వెల్లడించింది. అటవీ అధికారుల బృందం బామునిమైదాన్ లోకోమోటివ్ షెడ్ కు వెళ్లి ఇంజన్‌ను స్వాధీనం చేసుకుందని తెలిపింది. 
 
ప్రమాదానికి కారణమైన లోకోమోటివ్ పైలెట్, అతడి సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. కాగా ప్రజా సేవలను కొనసాగించడం దృష్ట్యా రైలు ఇంజన్ ను తిరిగి రైల్వే శాఖకు అప్పగిస్తూ.. నష్ట పరిహారంగా రూ.12 కోట్లు అటవీ శాఖకు ఇచ్చేందుకు రైల్వే అధికారులు అంగీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments