అదిరిపోయే స్టెప్పులేసిన డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (15:43 IST)
డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అదిరిపోయే స్టెప్పులేశారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు నృత్యప్రదర్శనతో ఆమె కలిపి నృత్యం చేశారు.  ఈ సందర్భంగా విద్యార్థినులు డిప్యూటీ సీఎంను డ్యాన్స్ చేయాల్సిందిగా పట్టుబట్టారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విద్యార్థినులతో కలిసి నృత్యం చేశారు. ఒక పదినిమిషాలపాటు నృత్యం చేసి విద్యార్థుల్లో ఆనందం నింపారు.
 
పుష్పశ్రీవాణి స్టెప్పులేస్తున్నంత సేపు విద్యార్థులు విజిల్స్ మోత మోగించారు. డిప్యూటీ సీఎంతోపాటు పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మీ సైతం మంత్రికి తోడుగా కాలు కదిపారు. సంగీతానికి తగ్గట్లుగా స్టెప్పులు వేస్తూ పాముల పుష్పశ్రీవాణి అదరహో అనిపించారు.
 
విశాఖ, మారిక వలసలో గురుకుల ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక నృత్యాలు చేస్తున్న విద్యార్థినులతో పాటు స్టెప్పులేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం సాంస్కృతిక నృత్యం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments