Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీల్ ఛైర్‌పై కాజల్-శ్రీనివాస్ కికి ఛాలెంజ్.. గాయాలతో కనిపించారు.. ఏమైంది..?

టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌లు సరదాగా కికి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కానీ వీరి కికి ఛాలెంజ్ వెరైటీగా మారింది. రోడ్డుపై కాకుండా సురక్షితమైన ప్రాంతంలో కికి ఛాలెంజ్‌లో పాల్గొన

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (15:01 IST)
టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌లు సరదాగా కికి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కానీ వీరి కికి ఛాలెంజ్ వెరైటీగా మారింది. రోడ్డుపై కాకుండా సురక్షితమైన ప్రాంతంలో కికి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. వీరిద్దరూ పాల్గొన్న కికి ఛాలెంజ్‌లో ఈ ఛాలెంజ్ వద్దనేలా వుంది.


ఈ వీడియోని కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మిమ్మలి సంతోష పరచడానికే కికి ఛాలెంజ్‌లో పాల్గొన్నామని చెప్పింది. అంతటికంటే ముందు నిబంధనల్ని కూడా పాటించాలి. అందుకే వీల్ చైర్‌లో కికి ఛాలెంజ్ డాన్స్ చేసినట్లు కాజల్ ట్వీట్ చేసింది.
 
కాగా.. కికి ఛాలెంజ్ ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణిస్తున్న వాహనం నుంచి కిందకు దిగి డ్యాన్స్ చేస్తూ, మళ్లీ వాహనంలోకి ఎక్కడమే ఈ ఛాలెంజ్. ఈ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలి. అయితే కికి ఛాలెంజ్‌తో ప్రమాదం వుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఛాలెంజ్‌పై పోలీసులు నిషేధం విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనలు పాటిస్తూ వీల్ ఛైర్‌పై కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ కికీ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 
 
ఇకపోతే.. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తోంది. డెబ్యూ దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీలక నటిస్తున్నాడు.

యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన సెల్ఫీని శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సెల్ఫీలో శ్రీనివాస్‌తో పాటు నీల్ నితిన్ ముఖేష్, కాజల్ గాయాలతో కనిపిస్తున్నారు. తాజాగా కాజల్ విడుదల చేసిన కికి వీడియోలోనూ స్వల్ప గాయాలైనట్లు కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments