Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లాడాడు.. హత్యచేసి ఫేస్ బుక్‌తో బుక్ అయ్యాడు

ప్రేమించి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డల్నీ కన్నాడు. ఆమెకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. భార్యను చంపి ఆ ప్రేమ.. పెళ్లి తాలూకూ రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేశాడు. నల్గొండ జిల్లా వెంకేపల్లి గ్రామానికి చెందిన మోర హన్మంతు హైదర

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (14:58 IST)
ప్రేమించి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డల్నీ కన్నాడు. ఆమెకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. భార్యను చంపి ఆ ప్రేమ.. పెళ్లి తాలూకూ రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేశాడు. నల్గొండ జిల్లా  వెంకేపల్లి గ్రామానికి చెందిన మోర హన్మంతు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఎల్బీనగర్‌ మజీద్‌గల్లీలో ఉండే ప్రియాంకను ప్రేమించిన అతను.. ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. 
 
విషయం తన వాళ్లకు గానీ.. భార్య తరఫు వారికి గానీ తెలియకుండా జాగ్రత్త తీసుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో సొంత ఊరిలోనే మకాం పెట్టాడు. వ్యవసాయ పనుల నిమిత్తం ఊరిలోనే ఉంటున్నానని నమ్మంచేవాడు. అప్పుడప్పడూ ఇంటికి వస్తూ ఉండేవాడు... ఎలాగైనా మొదటి భార్యను వదిలించుకోవాలని పథకం రచించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను వెంకేపల్లి గ్రామానికి తీసుకొచ్చి ఇంట్లోనే హత్య చేశాడు. మృతదేహాన్ని గ్రామ శివారులోని బావిలో పడేశాడు. 
 
ఆ బావిలో.. గ్రామస్తులంతా జంతువుల కళేబరాలు, వ్యర్థాలు వేస్తుండటంతో విషయం వెలుగులో రాలేదు. మరోవైపు కనిపించకుండా పోయిన(హన్మంతు రెండో భార్య) తన అక్క ప్రియాంక జాడ కోసం తమ్ముడు ఉపేందర్ వెతకటం ప్రారంభించాడు. అనుకోకుండా ప్రియాంక రెండోసారి గర్భం దాల్చిన సందర్భంలో ఆమె తమ్ముడు ఉపేందర్‌‌కు కనిపించింది. అక్క ఇంటికి వెళ్లి నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు. ఆరు నెలల తరువాత   ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకని మళ్లీ వెళ్లగా ప్రియాంక అక్కడ లేదు. 
 
చుట్టు ప్రక్కలవారిని అడుగగా మాకు తెలియదన్న సమాధానమే దొరికింది. ఆమె కుటుంబం ఆచూకీ కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉపేందర్. అయితే తన బావ హన్నంత్ ఈమధ్య కాలంటో ఫేస్ బుక్‌లో రెండో భార్య, పిల్లలతో ఉన్న ఫొటో అప్ చేయడంతో మర్రిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉపేందర్. ‘నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, మొదటి భార్యను తానే చంపి మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అంగీకరించాడు. మొదటి భార్యను చంపిన అనంతరం కుమార్తెను ఇతరులకు విక్రయించగా, కుమారుడిని మాత్రం బంధువులకు అప్పగించినట్టు తెలిసింది. మొత్తానిక ఫేస్ బుక్ ఒక నిందితుడిని పట్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments