Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలుతో కికి ఛాలెంజ్.. యువకులకు భలే శిక్ష విధించిన కోర్టు...

కికి ఛాలెంజ్‌ను ఎవరు ప్రారంభించారో తెలియదుగానీ... ఇది మరింత విస్తృతమవుతోంది. కికి ఛాలెంజ్‌ను స్వీకరిస్తే అరదండాలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా యువత మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, నిన్నా

Advertiesment
రైలుతో కికి ఛాలెంజ్.. యువకులకు భలే శిక్ష విధించిన కోర్టు...
, శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:10 IST)
కికి ఛాలెంజ్‌ను ఎవరు ప్రారంభించారో తెలియదుగానీ... ఇది మరింత విస్తృతమవుతోంది. కికి ఛాలెంజ్‌ను స్వీకరిస్తే అరదండాలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా యువత మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, నిన్నామొన్నటివరకు కారుకే పరిమితమైన ఈ కికి ఛాలెంజ్.. ఇపుడు రైలు వరకు వచ్చింది.
 
కొందరు యువకులు కదులుతున్న రైలు నుంచి కిందికి దిగి... ఫ్లాట్‌ఫామ్‌పై డ్యాన్స్ వేసి మళ్లీ రైలెక్కారు. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిసినా డోంట్ కేర్ అంటున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని విరార్‌ ప్రాంతంలో జరిగింది. 
 
ఈ ప్రాంతానికి చెందిన నిషాంత్‌ షా(20), ధ్రువ్‌ షా(23), శ్యాం శర్మ(24) అనే ముగ్గురు యువకులు రైలుతో కికి చాలెంజ్ చేశారు. కదులుతున్న రైలు నుంచి ప్లాట్‌ఫాంపైకి దూకిన వీరు డ్యాన్స్‌లు చేసి, మళ్లీ రైలెక్కారు. పైగా, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ఇవి అలా అలా తిరిగి పోలీసులకు చేరాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారించిన కోర్టు వీరు ముగ్గురు కికి డ్యాన్స్ చేసిన విసాయ్ రైల్వే స్టేషన్‌ను వారానికి మూడుసార్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. 
 
అంతేకాదు, శిక్షలో భాగంగా వారు స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు వీడియో తీసి దానిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ వీడియోలను చూసిన తర్వాత ఇంకా ఏదైనా శిక్ష వేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టంచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్శిటీ వాష్‌లో బట్టలూడదీసి విద్యార్థిని వేధించిన అగంతకుడు...