'ఎందుకంటే.. మేం భారతీయులం' .. రేసిస్ట్ అధికారికి బాలీవుడ్ నటుడు ఘాటు రిప్లై

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (08:59 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సతీశ్ షా జాతివివక్షను ఎదుర్కొన్నారు. లండన్‌లోని హిత్రూ విమానాశ్రయంలో ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది. కానీ, ఆయన ఎదుర్కొన్న తీరును, రేసిస్ట్ అధికారికి ఆయన చెప్పిన సమాధానంపై నెటిజన్లు అద్భుతం, శభాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై బాలీవుడ్ నటుడు ఓ ట్వీట్ చేశారు. 
 
హిత్రూ విమానాశ్రయంలో తాను విమానం ఎక్కుతున్న సమయంలో ఎయిర్‌పోర్టు ఉద్యోగి ఒకరు తనను ఉద్దేశించి.. మీరు ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఎలా కొనగలరని హేళనంగా ఉన్నాడని పేర్కొన్నారు. దీనికి తాను "ఎందుకంటే మేం భారతీయులం" అని గర్వంగా నవ్వుతూ సమాధానం చెప్పానని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
కాగా, షా ట్వీట్‌కు విపరీతమైన స్పందన లభించింది. సతీశ్ షాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వేలల్లో లైకులు వచ్చాయి. ఈ విషయం హిత్రూ విమానాశ్రయ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు స్పందించి, సతీశ్ షాకు క్షమాపణలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments