Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్టిపుల్ కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయా?

మల్టిపుల్ కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయా?
, బుధవారం, 19 జనవరి 2022 (17:04 IST)
కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోస్‌లు ఇచ్చిన ఇజ్రాయెల్‌లో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం ప్రకారం ఓమిక్రాన్‌ను అడ్డుకునే విషయంలో అంతగా పనిచేయకపోగా గణనీయమైన రక్షణను అందించడం లేదని తేలింది. ఇది సామాన్య జనాభా కోసం రెండవ బూస్టర్‌ను ప్రామాణీకరించిన మొదటి దేశం. నాల్గవ షాట్‌లు దేశవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన మూడు వారాల తర్వాత పరిశోధకులు సోమవారం ఫలితాలను ప్రకటించారు.
 
 
ఈ పరిశోధనలు యూరోపియన్ యూనియన్ టాప్ డ్రగ్ రెగ్యులేటర్ గత వారం వ్యక్తం చేసిన సందేహాలను ధృవీకరించినట్లుగా కనిపిస్తున్నాయి. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ వ్యాక్సిన్‌ల వ్యూహాల అధిపతి మార్కో కావలెరి, ఒక వార్తా సమావేశంలో నాల్గవ బూస్టర్‌ల యొక్క విస్తృత ప్రభావానికి మద్దతు ఇచ్చే డేటా ఏదీ లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. 

 
డెన్మార్క్, హంగేరి, చిలీ వంటి కొన్ని దేశాలు- రెగ్యులేటర్ల నుండి ఆందోళన ఉన్నప్పటికీ ఇప్పటికే రెండవ బూస్టర్‌లకు అధికారం ఇచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్-జనరల్ మాట్లాడుతూ, బ్లాంకెట్ బూస్టర్ విధానాలు మహమ్మారిని అంతం చేయడం కంటే పొడిగించే అవకాశం ఉందని అన్నారు. బహుళ బూస్టర్ మోతాదుల ప్రభావంపై డేటా లేకపోవడాన్ని ఉదహరించడంతో పాటు, తరచుగా పెంచడం వల్ల కోవిడ్ మహమ్మారికి రోగనిరోధక ప్రతిస్పందనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీనివల్ల బహుళ షాట్‌లను అందుకున్న జనాభాలో అలసట ఏర్పడుతుందని చెప్పారు.
 
 
 
మల్టిపుల్ బూస్టర్‌ల ప్రభావాన్ని రుజువు చేసే క్లినికల్ డేటా ఏదీ లేనప్పటికీ, తరచుగా బూస్టర్‌లు జనాభాలో అలసట కలిగించవచ్చనే ఆలోచనను బ్యాకప్ చేయడానికి సైన్స్ కూడా లేదని పరిశోధకులు అంటున్నారు. ఐతే దీనిపై మరిన్ని అధ్యయనాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడి దెబ్బకు నష్టాల్లో స్టాక్ మార్కెట్