భార్యాభర్తలను రోడ్డుపైనే కాల్చి చంపేసిన పోలీస్.. వీడియో వైరల్.. అసలేం జరిగింది..?

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (18:01 IST)
Cop
అసలేం జరిగింది..? ఇదే డౌట్ ప్రస్తుతం సోషల్ మీడియాను చూసిన నెటిజన్లంతా అడిగే ప్రశ్న. సోషల్ మీడియాలో రోజుకో వీడియో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా వీడియో భయాందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..? నడిరోడ్డుపై భార్యాభర్తలను ఓ పోలీస్ ఆఫీసర్ కాల్చి చంపేశారు. ఈ వీడియోపై సదరు పోలీస్ ఆఫీస్ వివరణ కూడా ఇచ్చారు. 
 
హర్యానాలోని ఓ కేఫ్ ముందు వున్న జంటను యూనిఫామ్‌లో ఉన్న పోలీస్‌ అధికారి తన చేతులో ఉన్న గన్‌తో కాల్చేశాడు. దీంతో వారిద్దరూ నేలపై పడిపోయారు. ఇది చూసిన చుట్టు పక్కన ఉన్న వారంతా ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో బాగా వైరల్‌ అవుతోంది. 22 సెకన్లున్న ఈ వీడియోను చూసి ఇది ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? అని చర్చించుకున్నారు. దీంతో ఈ వీడియో కాస్త చివరికి పోలీసు అధికారుల దృష్టికి చేరుకుంది. 
 
దీనిపై పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీసులు ఇది ఒక ఫేక్‌ వీడియో అని తేల్చి చెప్పారు. ఆ వీడియోలో ఉంది నటీనటులు.. ఆ వీడియో ఓ వెబ్‌ సిరీస్‌లో భాగంగా తెరకెక్కించదని పోలీసులు తేల్చారు. ఈ వీడియోను రాహుల్‌ శ్రీ వాస్తవ్‌ అనే పోలీసు అధికారి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియో ఓ వెబ్ సిరీస్ కోసం చిత్రీకరించబడిందని స్పష్టం చేశారు. ఈ వీడియోలో వున్న నటీనటుల పేర్లు శ్వేతా సిన్హా, దేవ్.. అంటూ వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments