Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.`అఖండ`గా గ‌ర్జించిన న‌ట‌సింహ(Video)

Advertiesment
`కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.`అఖండ`గా  గ‌ర్జించిన న‌ట‌సింహ(Video)
, మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:40 IST)
Akanda still
'సింహా', 'లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కోసం ప్రేక్ష‌కులు, నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు వారు చాలా ప్ర‌త్యేకంగా భావించే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండుగ పర్వదినం రోజున గ‌త చిత్రాల్లాగానే బాల‌య్య  సినిమాకు `అఖండ` అనే పవర్ ఫుల్ టైటిల్ ఎనౌన్స్ చేసి ఆడియెన్స్ కు సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు మేక‌ర్స్‌. దీంతో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.
 
ఈ టీజ‌ర్‌లో ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని సరికొత్త లుక్‌లో బాల‌య్య క‌నిపించ‌డంతో పాటు టైటిల్ కూడా ఆయ‌నకు యాప్ట్ అయ్యేలా ఉండ‌డంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. ఇక 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.' అంటూ హై వోల్టేజ్ తో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది. ముఖ్యంగా త‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.
 
మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం మే28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.
 
నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌తో  పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుత్తా జ్వాల- విష్ణు విశాల్ పెళ్లి ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?