గబ్బర్ సింగ్, శ్రీమంతుడు చిత్రాలతో ఫేవరెట్ హీరోయిన్ అయిన శ్రుతి హాసన్ ఇటీవలే క్రాక్ చిత్రంతో కిరాక్ ఎక్కించేసింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ చిత్రంతో బిజీగా వుంది. మరో రెండు మూడు చిత్రాలు చేతిలో వున్నాయంట. ఈ బ్యూటీని బాలయ్యతో నటించాల్సిందిగా గోపీచంద్ మలినేని సంప్రదించినట్లు టాలీవుడ్ న్యూస్.
ఐతే గోపీచంద్ చెప్పిన స్టోరీ మొత్తం విన్నాక హీరో ఎవరూ అని అడిగిందట శ్రుతి హాసన్. బాలయ్య అనేసరికి.. కొద్దిసేపు నీళ్లు నమిలి, చేతిలో రెండుమూడు ప్రాజెక్టులున్నాయంటూ తప్పించుకున్నదట. దీనితో చేసేది లేక గోపీచంద్ మలినేని మరో కథానాయకి కోసం వేటలో వున్నారట.
బాలయ్యకు హ్యాండ్ ఇచ్చారటగా, ఎందుకు అని ఎవరైనా అడిగితే... ప్రతి ఒక్కరికీ కారణాలు చెప్పాల్సిన పనిలేదని మూతి ముడుచుకుంటోందట. మరీ అంత బిగించుకుంటే మళ్లీ ఇంకెవరైనా ఏం అడుగుతారు?