అలియా భట్ ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెబుతోంది. దేనికోసం అంటే తాను నటించిన సినిమా కోసం. అదే `బ్రహ్మాస్త్రా`. మల్టీస్టారర్ మూవీ. ఈ సినిమాలో ఒక ప్రత్యేక స్నీక్ పీక్ ను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో తన పాత్రను చూసి తీరాల్సిందేనంటోంది. సినిమాలో తనకు ప్రత్యేకమైన సెట్ ఇదేనంటూ పేర్కొంది. అమ్మవారి ఉగ్రరూపం ముందు ఇలా ఫొటోకు ఫోజులిచ్చింది.
ఇటీవలే నాగార్జున తనకు సంబంధించిన షూటింగ్ ముగిసినట్లుగా ప్రకటించారు. ఇప్పుడు షూటింగ్ మొత్తం ముగింపుదశకు చేరుకుంది. త్వరలో ముగుస్తుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ 5 భారతీయ భాషలలో బ్రహ్మాస్త్రా థియేటర్లలో విడుదల అవుతుంది. దర్శకుడు:అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న బ్రహ్మాస్త్రా చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్నారు. రణ్‌బీర్, అలియా, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.