యువరత్న బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వర్కిగ్ టైటిల్ బీబీ-3 పేరుతో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తాజా సమాచారు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో "సింహా", "లెజెండ్" వంటి చిత్రాలు రాగా, అవి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.
ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే అనధికారికంగా ఈ సినిమాకు సంబంధించి పలు టైటిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
ఈ సినిమా టైటిల్ గురించి తాజాగా వెల్లడైన సమాచారం మేరకు.. 'గాడ్ ఫాదర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బాలయ్య ఇమేజ్‌కు, కథకు ఈ టైటిలే సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం నిర్ణయించింది. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను 'ఫస్ట్ రోర్' పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. ఆ వీడియోలో బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీయార్ జన్మదినోత్సవం సందర్భంగా మే 28న ఈ సినిమా విడుదల కాబోతోంది.