Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిన టీడీపీ మద్దతుదారులు!

Advertiesment
బాలకృష్ణ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిన టీడీపీ మద్దతుదారులు!
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (12:14 IST)
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, ఆదివారం నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇందులో హిందూపురం నియోజకవర్గంలో మొత్తం 38 గ్రామ పంచాయతీల్లో టీడీపీ మద్దతుతో అభ్యర్థులు పోటీ చేశారు. కానీ, కేవలం 8 చోట్ల మాత్రమే వారు గెలుపొందగా, 30 చోట్ల అధికార వైకాపా బలపరిచిన అభ్యర్థులు విజయభేరీ మోగించారు. 
 
అలాగే, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది. పెనుకొండ సెగ్మెంట్‌లోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. 
 
హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ ఓటమి చెందింది. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీ మద్దనకుంటలో టీడీపీ ఓటమి పాలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రితో తలనొప్పి.. ఎక్కడికి వెళ్ళినా అదే సమస్య.. ఏంటది?