తండ్రితో ఆ కుమారుడికి తలనొప్పి తప్పలేదు. తండ్రి చేసిన వీర్యదానం కొడుకుకు గర్ల్ ఫ్రెండ్స్‌ను దూరం చేసింది. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌లోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల జేవ్ ఫోర్స్ మాత్రం డేటింగ్ యాప్ వాడటానికి ఇబ్బంది పడుతున్నాడు.
వివరాల్లోకి యూఎస్‌లోని ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల జేవ్ ఫోర్స్ తండ్రి వయసులో ఉన్నప్పుడు 500 సార్లు తన వీర్యాన్ని దానం చేశాడట. దీంతో వారి రాష్ట్రంలోనే అనేక మంది అతడి వీర్యంతో సంతానం పొందిన వారున్నారు. ఇప్పుడు వారంతా దాదాపు జేవ్ వయస్కులే. ఇప్పుడు వాళ్లూ కూడా డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తూ ఉండొచ్చు.
తను డేటింగ్ యాప్‌ను వాడితే పొరపాటున ఎక్కడ తన తండ్రి వీర్యంతో జన్మించిన అమ్మాయిలతో ప్రేమలో పడతాడేమోనని భయపడుతున్నాడు. అలాంటి అమ్మాయిలకు తల్లులు వేరుగా ఉన్న జన్యుపరంగా జేవ్ తండ్రే జన్మనిచ్చినట్లుగా భావించాలి. అంటే వారంతా జేవ్‌కు వరుసగా సోదరీమణులవుతారు. ఇప్పుడు ఈ సమస్యే జేవ్ ఎవర్నీ ప్రేమించడానికి వీల్లేకుండా చేస్తోంది.
ఏ అమ్మాయి తన సోదరవుతుందో తెలియక జేవ్ డేటింగ్ యాప్‌ల జోలికి పోవడం మానేశాడు. ఇప్పటికే జేవ్ ఎనిమిది మంది తోబుట్టువులను గుర్తించాడట ఇలా ఎవరిని కలిసినా తన సోదరీమణులు అవుతారోనని ఆందోళన చెందుతున్నాడు.