Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతగా అడుగుతున్నారుగా... సర్లే వస్తానన్న నయనతార... ఎవరు? ఎక్కడికి?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (19:44 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి ప్రి-రిలీజ్ ఈవెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంటుకి చిరు సరసన నటించిన నయనతారను కూడా రమ్మన్నారట. దీనికి తొలుత నయన్ నో చెప్పిందట.

ఆ తర్వాత ఆమె ఎక్కడికెళ్లినా చిరు ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టి ఈవెంటుకు వస్తారా రారా అంటూ రిక్వెస్టులు మీద రిక్వెస్టులు చేస్తున్నారట. చిరు ఫ్యాన్స్ అంతగా అడుగుతుంటే నయనతార కదిలిపోయిందట. సర్లే నేను వెళ్తాను అని చెప్పిందట.
 
మరోవైపు సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మారింది. మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి మెగాభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అక్టోబర్-02న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుండటంతో.. ప్రి రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
 
అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మొదట కర్నూలు‌లో నిర్వ‌హించాలి అనుకున్నారు కానీ... అనివార్య కారణాల వల్ల హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా వేడుకలు జరగనున్నాయని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే 18 నుంచి 22కు వాయిదా పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అఖిలభారత చిరంజీవి యువత ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కానీ దర్శకనిర్మాతలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కాగా.. ఈ మెగా వేడుకకు ప్రత్యేక అతిథులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శధీరుడు రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ విచ్చేస్తారని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మార్చారు కానీ.. ఎందుకు మార్చాల్సి వ‌చ్చింది అనేది మాత్రం తెలియ‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments