గుంటూరు జిల్లా కాజా గ్రామంలో ఏరువాక పౌర్ణమి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తొలకరి పలకరింపులతో దుక్కి దున్ని నాట్లు వేసే సమయం ఆసన్నమవుతోంది అంటూ రైతన్నలు అరకలు కట్టి పూజలు చేసి భక్తి పారవశ్యంతో ఏరువాక పౌర్ణమి సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. ఏరువాక పౌర్ణమిలో పాలుపంచుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్రాక్టర్ స్వయంగా నడుపుతూ పొలాన్ని దున్నటం పలువురిని ఆకర్షించింది.
గ్రామంలో బొడ్డు రాయి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాలయంలో వేదమంత్రాలతో పూజలను చేశారు. ప్రభ తయారుచేసి విద్యుత్ దీపాలతో అలంకరించి ట్రాక్టర్లను, అరకలను కట్టి పూజలను నిర్వహించి పొలాలను అరకలతో దున్నారు.