Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ స్టార్ లో మిడిల్ క్లాస్ రాముడిగా విజయ్ దేవరకొండ

డీవీ
మంగళవారం, 5 మార్చి 2024 (09:22 IST)
Vijay Devarakonda, Mrinal Thakur
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.
 
నిన్న రాత్రి "ఫ్యామిలీ స్టార్" టీజర్ రిలీజ్ చేశారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన 'దేఖొరో దెఖో..' సాంగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ను వర్ణిస్తూ సాగిన ఈ టీజర్ ఆకట్టుకుంది. సర్ నేమ్ కు సరెండర్ అయి, ఫ్యామిలీ అంటే వీక్ నెస్ ఉన్న కలియుగ రాముడిగా హీరో విజయ్ దేవరకొండను ఈ టీజర్ లో చూపించారు. దేవుడి పూజతో సహా ఇంటి పనులన్నీ చేసుకుంటూ తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటుంటాడు హీరో. వాళ్ల జోలికి ఎవరైనా వస్తే మడత పెట్టి కొడతాడు. అతను వేస్తే బడ్జెట్ షాక్, ప్లాన్ గీస్తే ప్రాజెక్ట్ షేక్ అవుతుంది. టీజర్ చివరలో హీరోయిన్ మృణాల్ 'నేను కాలేజ్ కు వెళ్లాలి. కొంచెం దించేస్తారా..' అని అడిగితే..'లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..' అంటాడు హీరో. ఇలా హీరో క్యారెక్టర్ లో ఉన్న హోమ్లీ, మ్యాన్లీ, లవ్ లీనెస్ తో టీజర్ ఇంప్రెస్ చేసింది. ఫ్యామిలీ, క్లాస్, మాస్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన టీజర్ కంప్లీట్ మూవీని షార్ట్ గా చూసిన ఫీలింగ్ కలిగించింది. ఈ సమ్మర్ కు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా "ఫ్యామిలీ స్టార్" సినిమా ఉండబోతున్నట్లు టీజర్ క్లారిటీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ క్రైమ్: వాట్సాప్ పోస్టులు ఫార్వర్డ్ చేసినా నేరమేనా, ఎలాంటి పోస్టులు నేరమవుతాయి?

అప్రమత్తంగా ఉండండి: సహజ వాయువు పైప్‌లైన్‌ల తవ్వకం, నాశనం చేస్తే చట్టపరమైన చర్యలు

దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు.. ఎందుకంటే.. పవన్‌పై అలా?

కారం, పసుపు ఎక్కువగా తింటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

DCM రక్షణ బిల్లు ఎవరికోసం.. ఆ భాష ఏంటండీ బాబూ.. చదవలేకపోతున్నాను.. శ్యామల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments