Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

దేవీ
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (14:52 IST)
Shriya Saran, Gurucharan Neti and others
రీల్ లవ్ కాదు రియల్ లవ్ కావాలని కోరుకునే కుర్రాడి కథతో మిస్టర్ రోమియో చిత్రం రూపొందుతోంది. నేతి శ్యామ్ సుందర్ నిర్మాతగా మనోజ్ కుమార్ కటోకర్  దర్శకత్వం వహించిన మ్యూజికల్ ఫిలిం మిస్టర్ రోమియో. ఏ రీల్ లైఫ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ తో  రూపొందించారు. గురుచరణ్ నేతి, జుహీ భట్, అమిషి రాఘవ్ హీరో హీరోయిన్స్ గా నటించారు.

ఎస్ కే ఖాదర్,  నవనీత్ బన్సాలి,  కుల్దీప్ రాజ్ పురోహిత్ ముఖ్య పాత్రల్లో నటించారు. చైతన్య గరికిన  స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందించారు. ఈ మూవీ టీజర్ హీరోయిన్ శ్రియా శరణ్ విడుదలచేసి టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 
 
అనంతరం శ్రియా శరణ్ మాట్లాడుతూ, టీజర్ చాలా బాగుంది. మూవీ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గురు చరణ్ లో మంచి నటుడు ఉన్నాడు. టీజర్ లో కార్తీక్ గా కనిపించిన చరణ్ నటన బాగుంది. నాకు రియల్ లవ్ కావాలి. రీల్స్ లవ్ కాదు.. అని చరణ్ చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. హీరోగా  తను మరిన్ని సినిమాలు తీయాలని కోరుతున్నానన్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ఇది చిన్న సినిమా అయినా విజువల్ గా మాత్రం పెద్ద సినిమా చూసిన అనుభవం కలుగుతుంది. సినిమా మొత్తం పూర్తయిపోయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ వర్క్ జరుగుతుంది. మరో నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. గురు చరణ్ ను సినిమాల్లో లాంచ్ చేయడానికి ముందుగా ఇలాంటి మ్యూజికల్ ఫిలిం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకున్నాం. వారి తండ్రి శ్యామ్ సుందర్ చాలా సపోర్ట్ చేశారు. తనలో టాలెంట్ చాలా ఉంది. అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా అని అన్నారు.
 
హీరో గురు చరణ్ నేతి మాట్లాడుతూ, ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. యువతను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్యాషనేట్ టీం తో చేసిన ఈ ఫిలిం అందరికీ నచ్చేలా ఉంటుంది అని చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ, సినిమాల్లో చిన్నది పెద్దది అని తేడా ఉండదు. అది క్రియేట్ చేసే వండర్స్ ను బట్టి అది లెక్కలోకి వస్తుంది. యంగ్ జనరేషన్ కి నచ్చేలా ఈ ఫిలిం ను రూపొందించారు. ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా ఆయనకున్న అనుభవాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమా చాలా బాగుండటమే కాదు కొత్త ఒరవడిని సృష్టించబోతుంది అని అన్నారు.
 
నటీనటులు : గురుచరణ్ నేతి, జుహీ భట్, అమిషి రాఘవ్, ఎస్ కే ఖాదర్,  నవనీత్ బన్సాలి,  కుల్దీప్ రాజ్ పురోహిత్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments