Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

Advertiesment
Retro- Surya

దేవీ

, గురువారం, 1 మే 2025 (16:12 IST)
Retro- Surya
నటీనటులు :  సూర్య, పూజా హెగ్డే, జయం రవి, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, శ్రియా శరణ్ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : శ్రేయాస్ కృష్ణ, సంగీతం : సంతోష్ నారాయణన్, నిర్మాతలు : సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, దర్శకుడు : కార్తీక్ సుబ్బరాజ్. 
 
కథ:
1993 సమయంలో జరిగిన కథ ఇది. చిన్నతనంలోనే పారి (సూర్య) తన తల్లిదండ్రులు విడిపోవడంతో గ్యాంగ్ స్టర్ తిలక్ రాజ్ (జోజు జార్జ్) కి దొరుకుతాడు. ఆయన భార్య జాలితలిచి పెంచుకుంటుంది. ఇష్టంలేకపోయినా పారిలోని చేతిపవర్ గుర్తించి అతన్ని తన కుడిభుజంగా పెట్టుకుని గాంగ్ స్టర్ పనులు చేయిస్తాడు. పారికి చిన్నతనం నుంచి నవ్వడం అంటే పెద్దగాతెలీదు. సీరియస్ గా వుంటాడు. పెద్దయ్యాక పారి పెండ్లి రుక్మిణి (పూజా హెగ్డే) తో జరుగుతుంది.

సరిగ్గా ఆ టైంలో పారి దోచుకొచ్చిన గోల్డ్ షిఫ్ తనకివ్వమని లేదంటే రుక్మిణిని చంపేస్తానని తిలక్ రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ గొడవలో తిలక్ చేయిని పారి నరికేస్తాడు. పారిలో కోపం చూసి మారలేదని రుక్మిణి ఊరు వదిలి పోతుంది. పారిని జైలులో వేస్తారు. అక్కడ నుంచి ఎలా పారి బయటపడ్డాడు? రుక్మిణి కోసం అండమాన్ ఎందుకు వెళ్ళాడు? అక్కడ వెళ్ళాక ఎటువంటి పరిణామాలు సంభవించాయనేది మిగిలిన కథ.
 
సమీక్ష: 
ఈ కథ ఎటునుంచి ఎటువెళుతుందో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. చిన్నతనంనుంచి తల్లిప్రేమను పొందలేని పారి రుక్మిణి ప్రేమ కోసం పరితపించడం, అది కాస్త దూరం కావడం, దానికోసం ఓ మహా యుద్ధమే చేయడం జరుగుతుంది. మొదటి పార్ట్ సరదాగా సాగినా రొటీన్ తమిళ ఫార్మెట్ లోనే వుంది. ఇది అక్కడివారికి కనెక్ట్ కావచ్చుకానీ తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం ఆకట్టుకోలేదనే చెప్పాలి.
 
సెకండాఫ్ లో కథంతా అండమాన్ లోని ఓ దీవిలో జరుగుతుంది. అక్కడ పూర్వకాలం రాజుల పాలన, బ్రిటీష్ పాలనుంచి అక్కడ పాలించే వారు చుట్టుపక్కల మనుషులను ఎత్తుకొచ్చి బానిసలుగా వారిచేత పనులు చేయించుకోవడం. వారిలో వారికి యుద్ధ పోటీలు పెట్టడం, ఓడినవాడిని మొసళ్ళకు బలి ఇవ్వడం వంటివి వున్నాయి. 1960 కాలంనాటి కథ నుంచి నేటి కాలం వరకు అక్కడి పాలకులు ఏవిధంగా వున్నారనేది చూపిస్తూ సైకో యుద్ధ క్రీడను తలపించాడు. 
 
ఈమధ్య పాతకాలంనాటి కథలు సినిమాగా తీయడం మామూలైపోయింది. ఆ క్రమంలో హింస, రక్తపాతం  మామూలుగా చూపించడంలేదు. అది ఓ ప్రక్రియగా చూపించడం విశేషం. విదేశీయులు అండమాన్ వంటి దీవులకు వచ్చి వారి రాక్షసానందం  పొందడం, డ్రెగ్ కు అలవాటు పడడం, స్వేచ్ఛగా బతకడం వంటివి ఈ సినిమాలో వున్నాయి. దీనికి గోల్డ్ షిఫ్ కు లింక్ పెడుతూ రెట్రో కథను దర్శకుడు తయారు చేశాడు. ఒకరకంగా కామన్ మేన్ కు పెద్దగా అక్కరలేని కాన్సెప్ట్. ఈ సినిమాను సూర్య, భూమిక నిర్మించడం విశేషం. ఇప్పటికే సూర్య కు హిట్ వచ్చి చాలా కాలం అయింది. ఈ సినిమా కూడా ఆ కోవలోకి చెందుతుందేమో చూడాలి.
 
ఇక ఈ సినిమా చూడాలంటే సూర్య వల్లేనే చూడాలనిపిస్తుంది. ఆయన నటనలో వేరియేషన్స్, యాక్షన్ లో ఎనర్జీ లెవల్స్ చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. గ్యాంగ్ స్టర్ గా వున్నప్పటినుంచీ అండమాన్ దీవిలో బానిసలతో యుద్ధం వరకు ఆయన యాక్షన్ హైలైట్ గా వుంటుంది. ఇక ముగింపులో నవ్వు అనే కాన్సెప్ట్ పెట్టి మాజిక్ చేశాడు దర్శకుడు.   పూజా హెగ్డే డీ గ్లామర్ రోల్ గా చేసింది. తను బాగా సన్నపడింది కూడా. జోజు జార్జ్, నవ్వుల డాక్టర్ గా జైరాం లు డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు.  నెగిటివ్ రోల్ లో కనిపించిన  విదు తన పాత్రలో మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. 
 
మొదటి భాగం సోసోగా సాగుతుంది. సెకండ్ పార్ట్ లో హైప్ వుంటుందేమో అనుకుంటే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సరైన ట్విస్ట్ ఇవ్వలేకపోయాడు. ఎక్కువ భాగం యుద్ధం పేరుతో పోరాట సన్నివేశాలు కనిపిస్తాయి. కథ ఒకలా మొదలై అది కాస్తా ఏటెటో వెళుతుంది. వీటితో ఆడియెన్స్ ఏకాగ్రత తప్పుతుంది. సూర్యపై కొన్ని సీన్స్ బాగానే అనిపిస్తాయి కానీ అవన్నీ ఫ్లోలో కరెక్ట్ గా వుండవు. కొన్ని సీన్లు గత సినిమాలలో చూసినట్లుగా అనిపిస్తాయి.
 
సాంకేతికంగా... శ్రేయస్ కృష్ణ, సినిమాటోగ్రఫీ బాగుంది.  శ్రియ శరణ్ ఐటెంసాంగ్ చేసింది. ఎఫెక్ట్ అనిపించదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సంతోష్ నారాయణన్ తన సంగీతంతో చాలా సీన్స్ కి  కాలా సినిమా స్కోర్ కూడా కొట్టేసాడు. తెలుగు కోసం డబ్బింగ్ బాగుంది.  దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎంచుకున్న లైన్ వాటికి అనుగుణంగా రాసుకున్న కథనం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆకట్టుకునేలా లేదు. సూర్య కోసం చూడడానికి ఈ సినిమా ఓకే.
రేటింగ్: 2.75

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త