Webdunia - Bharat's app for daily news and videos

Install App

"క్రాక్" మూవీ నుంచి 'కోరమీసం పోలీసోడా' లిరికల్ సాంగ్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (09:51 IST)
మాస్ మహారాజ్ రవితేజ - చెన్నై బ్యూటీ శృతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం క్రాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బి. మధు (ఠాగూర్ మధు) నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రం నుంచి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఓ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన గేయరచనకు ఎస్.థమన్ సంగీత బాణీలు సమకూర్చారు. 
 
వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. ఇందులోభాగంగా "కోర‌మీసం పోలీసోడా" అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో ర‌వితేజ‌.. శృతి హాస‌న్‌తో క‌లిసి శృతిమించిన రొమాన్స్ చేసింది. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీని చూసి ప్రేక్ష‌కులు వావ్ అంటున్నారు. గ‌తంలో బ‌లుపు చిత్రంలో ఈ ఇద్ద‌రు క‌లిసి నటించ‌గా, ఇప్పుడు రెండో సారి ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు.
 
'క్రాక్' చిత్రం నుండి ఇప్ప‌టికే రెండు సాంగ్స్ విడుద‌ల చేయ‌గా, ఇప్పుడు విడుద‌లైన మూడో పాట శ్రోత‌ల‌ని అల‌రిస్తుంది. ఎస్. థ‌మ‌న్ మ్యూజిక్ కంపోజిష‌న్‌లో రూపొందిన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ క్రాక్ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. తాజాగా విడుద‌లైన కోర‌మీసం పోలీసోడా అనే సాంగ్‌ని మీరు విని ఎంజాయ్ చేయండి.
 
నిజానికి ర‌వితేజ ‌- శృతిహాస‌న్ కాంబినేష‌న్ అంటే ఫ‌న్‌, రొమాంటిక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సిల్వ‌ర్ స్క్రీ‌న్‌పై ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ అది‌రిపోతుంది. "బ‌లుపు" సినిమానే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇపుడు మ‌రోసారి ఆడియెన్స్‌ను ఆలరించేందుకు క్రాక్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకురానున్నారు.

 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments