Webdunia - Bharat's app for daily news and videos

Install App

అథర్వ నుంచి ఆకట్టుకుంటోన్న కేసీపీడీ వీడియో సాంగ్

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (17:54 IST)
kartika raju
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉంటాయి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లను క్లూస్ టీం కోణంలోంచి చూపించేందుకు 'అథర్వ' అనే చిత్రం రాబోతోంది. అన్ని రకాల ఎమోషన్స్‌ కలిపి తీసిన ఈ చిత్రం నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. 
 
ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో మంచి బీట్ ఉన్న వీడియో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. కేసీపీడీ అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. ఈ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు.  భాను మాస్టర్ కొరియోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల బాణీ, గాత్రం ఈ పాటను వినసొంపుగా, చూడముచ్చటగా మార్చేశాయి. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది.
 
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగం వారు వీక్షించారు. వారంతా కూడా సినిమాను ఆకాశానికెత్తేశారు. క్లూస్ టీంను ఇంత బాగా ఇదివరకు ఎవ్వరూ చూపించలేదని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హత్యకుగురైన పుంగనూరు బాలిక కుటుంబ సభ్యులకు సీఎం బాబు ఫోన్

మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి.. ఎందుకో తెలుసా?

స్వల్పశ్రేణి మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్!

వెయ్యి ఆవులు ఇస్తాం.. తితిదేకు సొంతందా డెయిరీ పెట్టుకోండి : రామచంద్ర యాదవ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments