తిరువీర్ ఇప్పుడు తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాలతో పాటు ఓటీటీ మాధ్యమంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ మిషన్ తషాఫిలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రణతి రెడ్డి నిర్మాత.
ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం శరవేగంగా పూర్తవుతుంది. ఇప్పుడు వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావటంపై మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. తిరువీర్ బర్త్ డే సందర్బంగా మిషన్ తషాఫిలో ఆయన నటిస్తున్నారంటూ జీ 5 అధికారికంగా ప్రకటించింది. తిరువీర్ విలక్షణ నటనతో తన పాత్రను డైరెక్టర్ ఊహించిన దాని కంటే ఇంకా బెటర్ ఔట్ పుట్ ఇస్తారని మేకర్స్ భావిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు వంటి డైరెక్టర్‌తో కలిసి పని చేయటంపై తిరువీర్ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఇండియా లో భారీ విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ఒక విదేశీ తీవ్రవాద సంస్థకి, ఇండియన్ RAW ఏజెంట్స్ కి మధ్య నడిచే బావోద్వేగమైన హై ఇన్‌టెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇది.
8 ఎపిసోడ్స్ ఉన్న మిషన్ తషాఫి వెబ్ సిరీస్‌ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు ఓటీటీలో ఎవరూ నిర్మించని రీతిలో జీ 5 దీన్ని భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిస్తోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను ఫారిన్ లొకేషన్స్‌లో చిత్రీకరించలేదు. కానీ తొలిసారి మిషన్ తషాఫి సిరీస్‌ను విదేశాల్లో కూడా చిత్రీకరిస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ నేతృత్వంలో ఫైట్స్‌ను చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.