Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరేషాన్‌ ప్రివ్యూ చూసాక నవ్వి నవ్వి.. దవడలు నొప్పి పెట్టాయి : రానా దగ్గుబాటి

Thiruveer, Pavani Karanam, rana daguupati, Rupak Ronaldson
, ఆదివారం, 21 మే 2023 (19:38 IST)
Thiruveer, Pavani Karanam, rana daguupati, Rupak Ronaldson
మసూద విజయంతో దూసుకుపోతున్న యంగ్ హీరో తిరువీర్ పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్‌లో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.  వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌ పై విశ్వతేజ్‌ రాచకొండ, సిద్దార్థ్‌  రాళ్ళపల్లి నిర్మించారు. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకుడు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు.  ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో పెద్ద బ్యాకింగ్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది.  జూన్‌ 2న థియేటర్‌లలో విడుదల కాబోతుంది.  
 
ట్రైలర్ అనంతరం హీరో తిరువీర్‌ మాట్లాడుతూ, ఈ సినిమా పోస్టర్‌లో వెనుకన వున్న చాలామంది ఊళ్ళలోనే ఉండేవారు. వారికి సినిమాలోకం గురించి పెద్దగా తెలీదు. వారందరినీ వెండితెరపైకి తీసుకువచ్చాం. అలా తీసుకురావడానికి రానా గారే కారణం. కొన్ని సినిమాలు మనం కనెక్ట్‌ చేసుకుంటాం. కొన్ని బాగా నచ్చి రిపీట్‌గా చూస్తుంటాం. మంచిర్యాలలో పుట్టి పెరిగి అక్కడ కథను రాసుకుని రూపక్‌ సార్‌ ఈ సినిమా తీశారు. ఈ సినిమాను రిపీట్‌గా చూస్తారని నమ్మకం వుంది. ఇంతకుముందు కొంతమందికి స్క్రీనింగ్‌ వేశాక, అరె.. ఏం సినిమారా.. నవ్వి నవ్వి దవడలు నొచ్చుకుంటున్నాయిరా.. అంటుండేవారు. దానికి భరోసాగా రానా దగ్గుబాటి గారి ప్రెజెంట్స్‌ వుంది కాబట్టి ధైర్యంగా సినిమాకు వచ్చేయచ్చు అని అన్నారు.
 
హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ఈ యంగ్‌ టీమ్‌ అంతా ప్రేమించి ప్యూర్‌ ఎనర్జీతో సినిమా తీశారు. అది సినిమాలో కనిపిస్తుంది. నేను మొదటిసారి చూసినప్పుడు నాకూ నవ్వి నవ్వి.. దవడలు నొప్పి పెట్టాయి.  నాకు తెలిసి హైదరాబాద్‌ వచ్చాక ఈ ఫంక్షన్‌ జరుగుతున్న ప్రాంతమంతా తారురోడ్డుతోనే వుండేది. ఈ చుట్టుపక్కలవున్న  ప్రపంచమే నా లోకం. అలాంటిది మీ టీమ్‌లో నేను చూశాను. ఇక తిరువీర్‌ నాతో ఘాజి సినిమాలో సబ్‌మెరైన్‌లో పని చేశాడు. తను మంచి ఆర్టిస్టు. తెలంగాణ ఫామ్‌మేషన్‌ డే జూన్‌ 2న ఈ సినిమా విడుదలకాబోతుంది. నిర్మాత విశ్వ నేను ఎక్కడున్నా పరేషాన్‌ చేస్తూ సార్‌. ట్రైలర్‌ చూడండి.. అంటూ చూపించేవాడు. చూశాక. నేను ఇందులో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదుగురు హీరోస్ లాంచ్ చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్