Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

డీవీ
శనివారం, 2 నవంబరు 2024 (15:00 IST)
Varun-meenakshi
వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’ ట్రైలర్ ఆవిష్కరణ ఈరోజు ఆన్ లైన్ లో మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. దర్శకుడు కరుణ కుమార్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ట్రైలర్ లో వరుణ్ తో పలు షేడ్స్ వున్నాయి.
 
మార్కెట్ లో కూలివాడిగా వుండి మట్కా జూదంలో నెంబర్ ఒన్ స్థాయికి ఎదిగిన వాడిగా చూపించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, బర్మానుంచి వలసవచ్చిన కూలివాడిగా నేను నటించాను. ఆ పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. ఇందులో హీరో, విలన్ నూ నేనే. ఆ పాత్రను దర్శకుడు అలా తీర్చిదిద్దారు అన్నారు. ట్రైలర్ అనంతరం చిరంజీవిగారు ఏమన్నారనేదానికి బదులిస్తూ, 60నాటికాలానికి తీసుకెల్ళావ్. పక్కా మాస్ సినిమా చేశావ్ అని అన్నారు అని వరుణ్ తెలిపారు.
 
ట్రైలర్ లో చివరిలో ఓ డైలాగ్ వుంది. మంచివాళ్ళు వుండడంల్ల వానలు సకాలంలో పడుతున్నాయి. నాలాంటి చెడ్డవాడి వల్ల పదిమందికి పనికలుగుతుంది అంటూ వరుణ్ తేజ్ డైలాగ్ గురించి స్పందిస్తూ... ఇది సన్నివేశపరంగా దర్శకుడు రాసుకున్నది అన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ, రైతులు కష్టపడి పనిచేస్తే వానలు కురిస్తే ఆ పంట వల్ల మనం అన్నం తింటాం. కానీ అదే రైతు దగ్గర పంటను మార్కెట్లో కొని వ్యాపారం చేసేవారు, దావూద్ ఇబ్రహీం దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడుకూడా మంచివాడే.   డ్రైవర్ గా అను సంపాదించి ఆ పంటనే తింటాడు. ఇందులో డ్రైవర్ తప్పులేదు. దావూద్ వల్లే  ఆయన బతుకుతున్నాడు అంటూ వివరించారు. నవంబర్ 14న మట్కా చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments