Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని ఆవిష్క‌రించిన భళా తందనాన టీజర్.

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (16:53 IST)
Sri Vishnu, Katherine
హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం 'భళా తందనాన' అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో న‌టిస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్.  ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది.
 
ఇప్ప‌టికే ఫస్ట్ లుక్ పోస్టర్, మ్యూజికల్ ప్రమోషన్స్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. నేడు న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీ టీజర్ విడుదల‌చేశారు.
 
‘రాక్షసున్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.. నేను మామూలు మనిషిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొద‌లైంది. ఇక శ్రీవిష్ణు సాఫ్ట్ రోల్‌లో కనిపించగా కేథరిన్ థ్రెస్సా మాత్రం పొగరుగా కనిపించారు. నీ దారిలో నువ్వు.. నా దారిలో నేను.. ఇద్దరి లక్ష్యం ఒకటే అనే డైలాగ్‌తో హీరో హీరోయిన్ల ప్రయాణం, లక్ష్యం ఏంటో చెప్పేశారు. యాక్షన్ సీక్వెన్స్, శ్రీ విష్ణు నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇక రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ముగిసిన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది.
 
టీజర్‌లోని డైలాగ్స్ సినిమా కథ ఎలా ఉండోబోతోంది అనేది చెప్పేశాయి. డైలాగ్సే సినిమాకు మేజర్ హైలెట్ అని తెలుస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను పక్కా కమర్షియల్‌గా తెరకెక్కించారు దర్శకులు చైతన్య దంతులూరి. ఇక ఈ టీజర్ మొత్తంలో శ్రీవిష్ణు తన నటనతో అందరినీ మెప్పించారు. నటనలోని వేరియేషన్స్ చక్కగా చూపించారు. కేథరిన్ ఈ రోల్‌కు పర్ఫెక్ట్ అనిపించేలా నటించారు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ, కేజీయఫ్ ఫేమ్ రామచంద్ర రాజు విలనిజం బాగా కుదిరాయి.  
 
మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తుండ‌గా..సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.
 
వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా రచయితగా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, గంధి నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments