Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

దేవీ
శుక్రవారం, 4 జులై 2025 (14:36 IST)
Tammudu- nitin
నటీనటులు : నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, సౌరబ్ తదితరులు
సినిమాటోగ్రఫీ : కెవి గుహన్, సమీర్, సేతు, సంగీతం : అజనీష్ లోకనాథ్, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, నిర్మాత : శిరీష్, సాంకేతికత: దర్శకత్వం: వేణు శ్రీరామ్.
 
కథ:
ఢిల్లీలో వుండే జై (నితిన్) తను వరల్డ్ ఆర్చరీ (విలు విద్య) లో ఛాంపియన్ కావలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్ లోనే ఏకాగ్రత లోపిస్తుంది. అందుకు కారణం తన చిన్నతంలో జరిగిన సంఘటన అని స్నేహితురాలు (వర్ష బొల్లమ్మ) కు చెబుతాడు. ఆమె ఇచ్చిన సలహాతో జై తన  చిన్న తనంలో విడిపోయిన అక్క స్నేహాలత (లయ)ను వెతికే ప్రయత్నంచేస్తాడు. అలా ఓ అడవి ప్రాంతంలో మొక్కు కోసం వెళ్ళిన తన అక్క స్నేహాలత (లయ) కుటుంబంను కలవడానికి వర్ష బొల్లమ్మతో కలిసి వెళతాడు.
 
అక్కడికి వెళ్ళాక తన అక్కను కొందరు దుండగులు చంపడానికి ప్రయత్నిస్తారు. లయ ప్రభుత్వాధికారి. వైజాగ్ లో జరిగిన ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదానికి కారణమైన ఓనర్ అజర్వాల్ (సౌరబ్) వల్ల చాలామంది చనిపోతారు. ఆమె నిజమైన రిపోర్ట్ ఇస్తే కొన్ని వందల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అది జరగకుండా సౌరబ్ తన అనుచరులతో ఏమి చేశాడు? చివరికి ధర్మం కోసం పోరాడే లయ కార్మికులకు న్యాయం చేసిందా? లేదా? మరి జై ఏం చేశాడు? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ చిత్ర కథ ఈమధ్య చాలాచోట్ల జరుగుతున్న సంఘటనలే. ఫ్యాక్టరీలు పేలిపోవడం, అందులో పనిచేసిన వారు చనిపోవడం, అందుకు ప్రభుత్వం ఒకవైపు, ఫ్యాక్టరీ యాజమాన్యం మరోవైపు సానుభూతిపేరుతో వారికి కాంపన్ జేషన్ ఇస్తుంది. వాటిని చట్టపరంగా అందరూ తీసుకుంటారు. కానీ మాకు మా ప్రాణాలు తీసుకురాగలరా? అంటూ యజమాని ఇచ్చే కాంపన్ జేషన్ కు కార్మికులు వ్యతిరేకిస్తారు. ఈ సంఘటనలు విన్నాక కామన్ మేన్ కూడా యాజమాన్యం, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వస్తుంది. కానీ ఏమీ చేయలేని స్థితి. ఆ టైంలో సామాన్యుడుగా వున్న నితిన్.. ఏంచేశాడు? దానికి అక్క సెంటిమెంట్ తో లింక్ చేస్తూ రాసిన కథ ఇది. 
 
సినిమా ప్రమోషన్ లో సోషల్ మీడియాలో తమ్ముడు దిల్ రాజుకు మరో గేమ్ ఛేంజర్ అంటూ ప్రచారం జరిగింది. మీడియా సమావేశంలో నూ దిల్ రాజు.. ఆ మాట వాడకుండా ప్రశ్నలు వేయమని చెప్పాడు. ఎంత గింజుకున్నా జనాలు చూసి చెప్పాలికదా. చూశాక వారే చెబుతారు.  ఎక్కువగా యాక్షన్ సీన్స్ వున్నాయి. అందుకే ఎ సర్టిఫికెట్ ఇచ్చారని నిర్మాత చెప్పాడు.
 
ఇక ఇందులో నితిన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అన్నీ సినిమాటిక్ గానే వున్నాయి. మగధీరలో రామ్ చరణ్ వందమందిని చంపితే చూశారు గదా. అందుకే తాను ఇందులో పెట్టినట్లు నిర్మాత చెప్పాడు. కానీ, సినిమాపరంగా బాహుబలి రాక్షసుల్లా ఊరి జనాలు వందలాదిగా వచ్చి నితిన్ అక్క కుటుంబాన్ని ఎటాక్ చేయడం అనేవి చాలా క్రుతంగా అనిపిస్తాయి. ఈ సినిమాలో అంతకుమించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.
 
మిగిలిన ఫాత్రలు ఎన్ని వున్నా అవి కథకు పెద్దగా ఉపయోగపడవు. కేవలం మారుమూల అటవీ ప్రాంతంలో జనాలు ఎలా వుంటారు. అక్కడ సప్తమి గౌడ వంటి గిరిజన మహిళలు ఏవిధంగా వుంటారనేది చూపించాడు. ఈ సినిమాలో డిజప్పాయింట్ చేసే అంశాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. అసలు కథనం సినిమాకి పెద్ద మైనస్. ఆడియెన్స్ కి ఉత్కంఠ కలిగించే మూమెంట్స్ అసలు కనిపించవు. అలా ఏదో వెళుతుంది అన్నట్టుగా సినిమా సాగుతుంది. ఎక్కడా ప్రేక్షకుడు ఫీల్ కాలేడు.
 
ఇందులో విలన్ రోల్ కూడా ఎ.పి., బీహార్, వెస్ట్ బెంగాల్ లో ఆమద్య జరిగిన కొన్ని సంఘటలకు చెందిన రాజకీయనాయకుల క్రూరత్వం కనిపిస్తుంది. బయటకురావాలంటే భయపడే విలన్, చుట్టూ వందలాది ప్రైవేట్ సెక్యూరిటీ, చిన్న సౌండ్ వున్నా భరించలేడు. అందుకు ఓ అద్దాల గదితోకూడిన వీల్ లాంటిదే బయటకు రావడం అన్నీ చూస్తే ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో ఇట్టే అర్థమవుతుంది.
 
సాంకేతికంగా సినిమాలో మేకర్స్ ఖర్చు బాగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బానే ఉంది. అయితే వి ఎఫ్ ఎక్స్ కొన్ని చోట్ల బెటర్ గా చేయాల్సింది. అజనీష్ లోకానాథ్ సంగీతం యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది. దర్శకుడు వేణు శ్రీరామ్ రాసుకున్న కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. పాతచింతకాయ పచ్చడిలా వుంది. సంభాషణలు కూడా ఎపెక్ట్ గా లేవు. దాదాపు 21 సంవత్సరాల అనుభవం వున్న దర్శకుడిగా ఆయన తీసిన సినిమానే ఇది అనిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమా తీసింది ఈయనేనా? అనే అనుమానం కూడా కలుగుతుంది. అది రీమేక్ కాబట్టి.. నెట్టుకొచ్చాడా అని భావించేలా వుంది.  ధర్మం కోసం జరిగే పోరు అన్న కాన్సెప్ట్ ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది.
 
మొత్తంగా పరిశీలిస్తే ఈ “తమ్ముడు” సినిమా ఒక మిస్ ఫైర్ అనొచ్చు. అంతకుముందు నిర్మాతకు గేమ్ ఛేంజర్ మరోసారి అవుతుందని కూడా ప్రేక్షకులు అనుకోవడం వినిపించింది. ఏది ఏమైనా ఇప్పడు జరుగుతున్న సంఘటనలనే తీసుకున్నా ఇంకా బాగా తీయాల్సింది.
రేటింగ్: 2.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments