Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ఠాగూర్
శుక్రవారం, 4 జులై 2025 (13:37 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "హరిహర వీరమల్లు". ఈ చిత్రం విడుదలకు ముందే సంచనాలు సృష్టిస్తుంది. ఈ నెల 24వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో గురువారం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసింది. విడుదలైన కేవలం 24 గంటల్లనే ఈ ట్రైలర్‌‌కు ప్రేక్షకుల నుంచి అసాధారణమైన స్పందన లభించింది. 
 
ఒక్క తెలుగు వెర్షన్ ట్రైలర్‌కే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఇక అన్ని భాషల్లో కలిసి ఈ ట్రైలర్‌కు 24 గంటల్లోనే 61.7 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టినట్టు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదని, భవిష్యత్‌లో రాబాయే ఒక హెచ్చరిక అని కూడా చిత్రబృందం పేర్కొంది.
 
చారిత్రక కథాంశంతో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తుంటే, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, తనికెళ్ల భరణి వంటి సీనియర్ నటీనటులు అనేక మంది కీలక పాత్రలను పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments