Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలో'చింపజేసే మంచు విష్ణు 'ఓటర్‌'

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (17:20 IST)
నటీనటులు : మంచు విష్ణు, సురభి, సంపత్‌ రాజ్‌ తదితరులు.
 
సాంకేతికవర్గం: సినిమాటోగ్రాఫర్‌ : రాజేశ్ యాదవ్, సంగీతం : తమన్‌, నిర్మాత :జాన్‌ సుధీర్‌ పూదోట, దర్శకత్వం : జి కార్తీక్‌ రెడ్డి 
 
రాజకీయనేపథ్యంలో ఎన్నికలకు ముందు పలు చిత్రాలు వచ్చాయి. అందులో హీరో మంచు విష్ణు, సురభి జంటగా జి కార్తీక్‌ రెడ్డి దర్శకతంలో తెరకెక్కిన మూవీ 'ఓటర్‌'. ప్రస్తుత రాజకీయ పరిస్తితుల పై వ్యంగ్యాస్త్రంగా, పొలిటికల్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం కొన్ని కారణాలవల్ల వాయిదా పడి ఎట్టకేలకు ఈ శుక్రవారమే విడుదలైంది. ఓటర్‌కు నాయకుల్ని ప్రశ్నించే హక్కుందని ట్రైలర్‌ ద్వారా ఆసక్తికరంగా అనిపించిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ :
అమెరికాలో ఉద్యోగం చేస్తోన్న గౌతమ్‌ (మంచు విష్ణు) తన ఓటు వేయడానికి స్వదేశానికి (భారత్)కు వస్తాడు. అయితే అనుకోకుండా సురభిని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఆమె ఇష్టపడదు. నిన్నే పెళ్లిచేసుకుంటానని గౌతమ్‌ వెంటబడడంతో సురభి అతనికి ఓ పని అప్పగిస్తుంది. అది పూర్తిచేస్తే తనే ఐ లవ్‌ యు చెబుతానంటుంది. దీంతో గెలిచిన ఎం.ఎల్‌.ఎ. చేత ఎన్నికల్లో అతను చేసిన వాగ్డాలన్నింటినీ నెరవేర్చేలా గౌతమ్‌ చూస్తాడు.

ఆ తర్వాత ఎం.పి. అయిన సంపత్‌ రాజ్‌ పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టే స్థలాన్ని కబ్జా చేస్తాడు. ఆ స్థలాన్ని తిరిగి పేదలకు వచ్చేలా చేస్తానని గౌతమ్‌ ఆ పేదలకు మాట ఇస్తాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వివివాదమే జరుగుతుంది. చివరకు నాయకులు ప్రజల్ని మోసం చేస్తే రీకాల్‌ చేయవచ్చని పాయింట్‌ను తెరముందుకు తెచ్చి గౌతమ్‌ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
ఎన్నికల్లో గెలిచిన వాడు వెదవ అని తెలిశా 'రీకాల్‌' అని రాజ్యాంగం ఎందుకు కల్పించలేదో ప్రతి ఓటర్‌ ప్రశ్నించాలి. అనేదే ఈ చిత్రంలోని ప్రధాన అంశం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎంతోమంది మేథావులు చాలాచోట్ల దీన్ని ప్రస్తావించారు. కానీ ప్రయోజనం శూన్యం. అందుకే చిత్ర దర్శకుడు మంచి పాయింట్‌ను ఎంచుకుని సినిమా తీశాడు.

ఇది భారతదేశ రాజకీయ వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనం. ఈ బలమైన పాయింట్‌ను సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతను ముందుగా అభినందించాలి. ఇక దర్శకుడు తను చెప్పాల్సిన ప్రతి అంశాన్ని సన్నివేశపరంగా, సంభాషణలపరంగా అద్భుతంగా రాసుకున్నాడు.

రాజకీయ నాయకుల గురించి ఈ చిత్రంలో దర్శకుడు జి కార్తీక్‌ రెడ్డి ప్రస్తావించిన అంశాలు కూడా ఆలోచింపజేస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే పోసాని సన్నివేశాలు, అలాగే విష్ణు ఇండియా గురించి చెప్పే సన్నివేశం సీన్స్‌ చాలా బాగున్నాయి. ముగింపు కూడా దర్శకుడు అనుకున్నట్లు సినిమాటిక్‌గా తీసేశాడు. 
 
ఈ చిత్రం మంచు విష్ణు గత చిత్రాలకు భిన్నంగా వుంది. 'అసెంబ్లీ రౌడీ' అనే చిత్రం ఛాయలున్నాయని ప్రచారం జరిగినా ఓ సన్నివేశం ఇంచుమించు అలాంటిదే పతాకసన్నివేశానికి ముందు కనిపిస్తుంది.


పక్కా రాజకీయవ్యవస్థపై ఎక్కువ పెట్టిన అస్త్రంగా వచ్చిన ఈ సినిమా ఎలక్షన్లకు ముందు వస్తే చిత్రం తీసినందుకు సార్థకత అయ్యేది. మంచు విష్ణు ఫ్రెష్‌లుక్స్‌తో డైలాగ్‌ డెలివరీతో బాగానే నటించాడు. హీరోయిన్‌ సురభి తన గ్లామర్‌తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటులు పాత్రల మేరకు నటించారు.
 
అయితే ఈ పాయింట్‌ను మరింత గట్టిగా పెద్ద హీరోతో చేస్తే చిత్రం స్థాయి పెరిగేది. దర్శకుడు రాసుకున్న ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, చిత్రం రెండోభాగంలో కీలక సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్‌‌గా అనిపిస్తాయి.

అసలు గౌతమ్‌ను తన తల్లి ఇండియా రమ్మని కోరినా రానివాడు కేవలం తన నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనగానే ఎందుకు వచ్చాడనే పాయింట్‌ను ఎస్టాబిస్‌ చేయలేదు. అందుకే సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే అంశాలు పెట్టడానికి దర్శకుడు బాగానే ప్రయత్నం చేసినప్పటికీ, మిగిలిన విభాగాల నుండి సరైన సపోర్ట్‌ లేకపోవడం వల్లే మొత్తానికి అవి సరిగ్గా ఎలివేట్‌ అవ్వలేదు.
 
రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్‌ కాబట్టి సంబాషణలు, సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లు అనిపించాయి. వాటిని మరింత ఆసక్తిగా తీయాల్సింది. సంగీత దర్శకుడు తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తోంది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. అశ్విన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా నిండా ఎమోషన్‌ ఉన్నా ప్రేక్షకుడు ఇన్‌ వాల్వ్‌ అయ్యే విధంగా ఆ ఎమోషన్‌ ఎలివేట్‌ కాలేదు.

దీనికితోడు ఒక మినిస్టర్‌ పై రీకాల్‌ ఎలెక్షన్‌ పెట్టే క్రమంలో వచ్చే సీన్స్‌ కూడా బలంగా అనిపించవు. మొత్తంగా మంచి చిత్రాన్ని తీయాలన్న తపన అటు దర్శక నిర్మాతల్లో కన్పించింది. అందరినీ ఆలోచింపజేసే చిత్రంగా మలిచిన ఇటువంటి చిత్రాలు మరిన్ని వస్తే రాజకీయ ముఖచిత్రం మారిపోతుందనే చెప్పాలి. మరి ఎలక్షన్ల తర్వాత విడుదల కావడంతో ఓటర్‌ ఏవిధంగా స్పందిస్తాడో చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

#DuvvadaMaduriSrinivasLove: ప్రేమ గుడ్డిది కాదు.. ప్రేమను కళ్లారా చూడవచ్చు.. (video)

ప్రియాంక గాంధీపై ‘జాతీయ జనసేన పార్టీ’ పోటీ.. ఎవరీ దుగ్గిరాల నాగేశ్వరరావు

పవన్ 'తుఫాన్' ఎఫెక్ట్: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంటున్న Mahayuti కూటమి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments