Webdunia - Bharat's app for daily news and videos

Install App

''భరత్ అనే నేను'' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ 4/5.. రంగస్థలాన్ని?(Mahesh Video)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా తొలి రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది. మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కొరటాల-

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (18:00 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా తొలి రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది. మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కొరటాల- మహేష్ కాంబోలో ఇప్పటికే తెరకెక్కిన శ్రీమంతుడు బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి, జనతాగ్యారేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. 
 
తాజాగా కొరటాల మహేశ్ బాబుతో రెండో సినిమా చేశాడు. ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా తొలి రివ్యూ రిపోర్ట్‌ను యూఏఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సాంధూ అందించాడు. ఇటీవల రామ్ చరణ్‌ రంగస్థలం సినిమాకు ఉమర్ రివ్యూ ఇచ్చాడు. రంగస్థలం సినిమాకు ఉమర్ 3.5 పాయింట్స్ రేటింగ్ ఇచ్చాడు. 
 
ప్రస్తుతం ''భరత్ అనే నేను'' చిత్రానికి ఏకంగా 4/5 రేటింగ్ ఇచ్చాడు. ఈ రేటింగ్‌ను బట్టి చూస్తే రంగస్థలం చిత్రాన్ని భరత్ అనే నేను సినిమా అధిగమిస్తుందని టాక్ వస్తోంది. భరత్ అనే నేను సినిమా మైండ్ బ్లోయింగ్‌గా వుందని, తప్పకుండా సాలిడ్ హిట్ అవుతుందని ఉమర్ సాధూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు ఇంటర్వ్యూ... Video చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments