Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది లెజెండ్ ట్విట్టర్ రివ్యూ... స్ఫూఫ్‌గా వుంది.. పాత చింతకాయ పచ్చడి..

Webdunia
గురువారం, 28 జులై 2022 (14:26 IST)
Legend
తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త శరవణన్ హీరోగా జేడీ అండ్ జెర్రీ ద్వయం తెరకెక్కించిన చిత్రమే 'ది లెజెండ్'.  ఊర్వశీ రౌటేలా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శరవణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శరవణన్ స్వయంగా నిర్మించారు.
 
శరవణన్ నటించిన 'ది లెజెండ్' మూవీ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. 
 
ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు పూర్తిగా భిన్నమైన టాక్ వచ్చింది. ఇది ఏవరేజ్ అని కొందరు.. బిలో ఏవరేజ్ అని మరికొందరు ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.
 
'ది లెజెండ్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం హీరో సాదాసీదా ఎంట్రీతో, పూర్తిగా తెలిసిన కథతో, ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగే సన్నివేశాలతో సోసోగా సాగిపోతుందట. 
 
అంతేకాదు, ఇది ల్యాగ్ అయినట్లు కూడా అనిపిస్తుందట. అలాగే, సెకెండాఫ్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించని విధంగా ఏవరేజ్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
 
ఇందులో హారీశ్ జయరాజ్ అందించిన మ్యూజిక్, నిర్మాణ విలువలు తప్ప అన్నీ మైనస్ అనే ట్విట్టర్‌లో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లెజెండ్ సినిమా శివాజీ, కేజీఎఫ్ చాప్టర్ 2, మెర్సల్ వంటి చిత్రాలకు స్ఫూఫ్‌గా రూపొందినట్లు ఉందని కామెంట్లు చేస్తున్నారు. 
 
శరవణన్ నటించిన 'ది లెజెండ్' సోసోగా సాగిపోతే పాత చింతకాయ పచ్చడి అని తెలుస్తోంది. అయితే, పేరడీ, స్ఫూఫ్ చిత్రాలను ఇష్టపడే వాళ్లు మాత్రం దీన్ని ఒకసారి చూడొచ్చట.
 
శరవణన్ నటించిన 'ది లెజెండ్' మూవీపై ట్విట్టర్ వేదికగా ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓ నెటిజన్ 'విజయ్ నటించిన బిగిల్, బీస్ట్, భైరవ చిత్రాలతో పోలిస్తే ఇది చాలా బాగుంది' అని వెటకారంగా కామెంట్ చేశాడు. అలాగే మరో నెటిజన్ ఏకంగా ఈ సినిమా తమిళ చిత్ర పరిశ్రమకు 'అఖండ' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments