సాంకేతిక నిపుణులుః సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వాద్, నిర్మాతలు: అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె, రచన-దర్శకత్వం: సుకు పూర్వజ్.
స్పోర్ట్‌మెన్ అరవింద్ కృష్ణ నటించిన తొలి సినిమా `ఇట్స్ మై లవ్ స్టోరీ`. నటుడిగా ఆ తర్వాత చేసినా కొంత గేప్ తీసుకున్నాడు. ఇప్పుడు నటించిన సినిమా శుక్ర. సుకు పూర్వజ్ దర్శకత్వంలో రుజాల ఎంటర్ టైన్ మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో రూపొందింది. ఎన్నో యాక్షన్ థ్రిల్లర్‌లు వచ్చినా ఇది విభిన్నంగా వుంటుందని దర్శకుడు చెబుతుండేవాడు. కరోనా కాలంలోనూ ధైర్యంగా విడుదల చేసిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ :
విల్లి (అరవింద్ కృష్ణ) సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతుంటాడు. ప్రియ (శ్రీజిత ఘోష్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తన సొంత ఇంటికి వైజాగ్ వస్తారు. ఇంకోవైపు వైజాగ్‌లో ఉత్తరభారతదేశానికి చెందిన తగ్స్ అనే మాఫియా ముఠా పెద్దంటినివారిని టార్గెట్ చేసి డబ్బు దోచుకుంటూ ఎదురుతిరిగితే చంపేస్తుంటుంది. ఓరోజు తన పుట్టినరోజు వేడుకను జరపాలని కోరుతుంది ప్రియ. ఈ సందర్భంగా విల్లీ తన స్నేహితులతో పార్టీ జరుపుకుంటుండగా కొందరు దాడిచేసి ప్రియను, కొంతమందిని చంపేస్తారు. ఈ హటాత్ పరిణామానికి షాక్ తిన్న విల్లి ఆ తర్వాత తేరుకుని ఇందుకు కారణం ఎవరు? అనే కోణంలో శోధిస్తాడు. అది ఎలా? చివరికి ఏమయింది? అనేది కథ.
విశ్లేషణః
థ్రిల్లర్ జోనర్‌లో పలు సినిమాలు వచ్చినా ఇది కొత్తగా అనిపిస్తుంది. చూడ్డానికి హాలీవుడ్ తరహాలో దర్శకుడు మలిచే ప్రయత్నం చేశాడు. చాలా చోట్ల ఇంగ్లీషు పదాలే వాడాడు. ముఖ్యంగా పోస్టర్లలో చూపించినట్లుగా విల్లి, రియా మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సరదాగా సాగుతుంటాయి. లిప్‌కిస్‌లున్నా పరిమితి మేరకు చూపించాడు. ప్రతి సీన్ కు ఎడిటింగ్ లో వేసిన డిస్క్రిప్షన్స్ కొత్తగా ఉన్నాయి. అయితే కొన్నిచోట్ల కథనం నిదానంగా సాగుతుంది. సినిమా విషయంలో ఏ సినిమాకు పోలిక లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. శుక్ర ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది.
నటనాపరంగా చూస్తే,
ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అరవింద్ కృష్ణ ఆ తరువాత రెండు మూడు సినిమాలతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్సుకున్నాడు. కొంత గ్యాప్ తరువాత అరవింద్ కృష్ణ నటించిన చిత్రం శుక్ర. ఈ సినిమాలో విల్లి గా అరవింద్ నటన బాగుంది. ముక్యంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసాడు. అటు అందంగానూ తనదైన పర్సనాలిటీ తో ఆకట్టుకున్నాడు. ఇందులో హీరోయిన్ గా చేసిన శ్రీజిత ఘోష్ ఆకట్టు కుంది. సి ఐ గా చేసిన తివారి నటన మెచ్చుకోదగినదిగా వుంది. పరిశోధించే విధానం బాగుంది. మిగిలిన పాత్రలు పరిధిమేరకు నటించాయి.
సాంకేతికపరంగా చూస్తే,
థ్రిల్లర్ సినిమాకు రీరికార్డింగ్ కీలకం. దాన్ని ఆశీర్వాద్ ఇచ్చిన బ్యాగ్రౌడ్ స్కోర్ సరితూగింది.. అతనికి ఈ విషయంలో చాలా అనుభవం ఉన్నట్టు అనిపించింది. ఫొటోగ్రఫీ కూడా ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ కూడా కథను ఎలివేట్ చేసేలా ఉంది. జగదీష్ బొమ్మిశెట్టి ఫోటోగ్రఫి సినిమాకు మరో హైలెట్, అలాగే ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.
కథను కాస్త గందరగోళపరిచేలా కొన్ని సన్నివేషాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త పడిఉంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ ప్రకారంగా ఖర్చు చేశారు. ఇక దర్శకుడు తొలి సినిమా అయినా మేకింగ్ విషయంలో చాలా చక్కగా చేసాడు. ఇలాంటి మైండ్ గేమ్ సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. ఆ విషయంలో సుకు జాగ్రత్త పడ్డాడు. సినిమాలో ఉన్న సస్పెన్స్ ను చివరివరకు సినిమాలోని నటీనటులకె కాదు. ప్రేక్షకులకు కలిగించాడు. మొత్తానికి ఓ మంచి సస్పెన్సు థ్రిల్లర్ అండ్ మైండ్ గేమ్ కథగా శుక్ర ను అద్భుతంగా తెరేక్కించాడు. సీరియస్ మూవీలోఎంటర్ టైనేమేంట్ విషయంలో ఆలోచన చేయలేదు. అది కొంత మైనస్ గా అనిపిస్తుంది. ఇక రొమాంటిక్ అంశాలు, గ్లామర్, క్రైం అన్ని విషయాలు బాగున్నాయి. సస్పెన్స్‌పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ సినిమా దర్శకుడుకిది తొలి సక్సెస్ సినిమా అని చెప్పొచ్చు. ఈ కరోనా టైంలో పరిమిత థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను ఓటీటీలో ఆదరణ మరింత బాగుంటుందని చెప్పొచ్చు.