Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలెక్షన్ల పరంగా "వకీల్ సాబ్" అబౌ యావరేజేనా?

Advertiesment
కలెక్షన్ల పరంగా
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:35 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రంల వకీల్ సాబ్. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలైంది. విడుదలైన ప్రతి సెంటరులో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి నాలుగు రోజులు అయితే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. 
 
అయితే, ఆ తర్వాత మాత్రం సినిమా దూకుడు తగ్గిపోయింది. దీనికి కారణం కరోనా వైరస్ వ్యాప్తితో పాటు.. వివిధ రకలా ఆంక్షలు. అలాగే, తెలంగాణాలో థియేటర్లు మూసివేయడం. ఇలా అనేక కారణాలతో సినిమా కలెక్షన్లు కొంతమేరకు తగ్గాయి. 
 
ఈ నేపథ్యంలో గత 13 రోజుల కలెక్షన్లను ఓసారి పరిశీలిస్తే, నైజాం - రూ.24.10 కోట్లు, సీడెడ్ - రూ.12.71 కోట్లు, ఉత్తరాంధ్ర - రూ.11.60 కోట్లు, 
ఈస్ట్ - రూ.6.14 కోట్లు, వెస్ట్ - రూ.7.13 కోట్లు, గుంటూరు - రూ.7.07 కోట్లు, కృష్ణా - రూ.4.88 కోట్లు, నెల్లూరు - రూ.3.33 కోట్లు చొప్పున కలెక్షన్లు రాపట్టింది. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (టోటల్) రాష్ట్రాల్లో మొత్తంగా రూ.76.99 కోట్ల కలెక్షన్స్ సాధించాయి. రెస్టాఫ్ ఇండియాలో రూ.3.58 కోట్లు, ఓవర్సీస్ రూ.3.83 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా (టోటల్) రూ.85.03 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. 
 
అయితే, "వకీల్ సాబ్" సినిమా రూ.89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు సినిమా రూ.85 కోట్లు షేర్ వసూలు చేసింది. పవన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'వకీల్ సాబ్'. "అత్తారింటికి దారేది" రూ.81 కోట్లు వసూలు చేసింది. 
 
ఇప్పుడు 'వకీల్ సాబ్' ఆ సినిమాను దాటేసింది. అయితే కరోనా కార‌ణంగా లక్ష్యానికి రూ.5 కోట్ల దూరంలోనే ఆగిపోయాడు పవర్ స్టార్. ఫలితంగా కలెక్షన్ల పరంగా అబౌ యావరేజ్‌గా నిలిచిందన్న టాక్ వినిపిస్తోంది. 
 
కాగా, ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించగా, శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. 'పింక్' సినిమా కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్దాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#StaySafeMaheshAnna సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి మహేష్ ఫ్యామిలీ!