Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#StaySafeMaheshAnna సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి మహేష్ ఫ్యామిలీ!

Advertiesment
#StaySafeMaheshAnna సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి మహేష్ ఫ్యామిలీ!
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (23:24 IST)
Mahesh babu
దేశంలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు, సెలబ్రిటీల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. కరోనాతో థియేటర్లు సైతం మూతపడ్డాయి. మరో వైపు సినిమా షూటింగ్‌లు సైతం వాయిదా పడ్డాయి.

అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా, వారితో సన్నిహితంగా ఉన్న మరి కొందరు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతున్నారు.

ఇప్పటికే టాలీవుడ్‌ టాప్‌ హీరోలలో పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌ రాగా, ఆయన చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రభాస్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌కు కరోనా రావడంతో ప్రభాస్‌ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
 
అయితే ప్రస్తుతం మహేష్‌ బాబు సర్కారువారి పాట చిత్రంలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు షూటింగ్‌ను వాయిదా వేశారు మహేష్‌. 
webdunia
Mahesh babu


తాజాగా తన పర్సనల్‌ స్టైలిస్ట్‌ కరోనా బారిన పడటంతో అతనితో పాటు మరి కొందరిలోనూ కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ముందు జాగ్రత్తగా మహేష్‌ బాబు క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 
 
ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ఒక్కొక్కరికి సినీ పరిశ్రమలో కరోనా పాజిటివ్‌ రావడంతో ఆందోళన మొదలైంది.

పాజిటివ్‌ వచ్చిన వారినితో సన్నిహితంగా ఉన్న వారు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో #StaySafeMaheshAnna అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. కరోనా నుంచి జాగ్రత్తగా వుండాల్సిందిగా నెట్టింట ప్రిన్స్ ఫ్యాన్స్ అభ్యర్థిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు ఓ మంచి ఇంటి వైద్యం.. రాగులు.. ఆవాలు..?