Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్.. ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?

బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్.. ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (22:51 IST)
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ను తమ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎవరు ఏమైనా చెప్పినా పర్లేదు. పవన్ కల్యాణ్ ప్రజల ముందుకు వచ్చి తన సిద్ధాంతాన్ని చెప్పాలన్నారు. ఎవరో ఎవరినో సీఎం చేయడం ఏమిటని అడిగారు. దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఆయన అన్నారు. 
 
పవన్ కల్యాణ్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఫ్యాన్ ఫాలోయింగ్‌లా ఉందని వ్యాఖ్యానించారు. దేశమంతా ఒకే ఫార్ములా తెస్తామని బీజేపీ అంటోందని.. అది సరికాదన్నారు. అందుకే కేసీఆర్, మమతా బెనర్జీ ఫెడరల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారని.. దేశమంతా ఒకే ఫార్ములా కుదరదన్నారు. భిన్న సంస్కృతులు భాషలు భిన్నమైన అవసరాలు వుంటాయని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రేవైటీకరణ నిర్ణయాన్ని ప్రకాశ్ రాజ్ వ్యతిరేకించారు. అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. 
 
నష్టాలు వస్తున్నాయి కాబట్టి విక్రయిస్తున్నామని అంటున్నారని ప్రస్తావించగా ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని, అది ప్రభుత్వం పని కాదని చెప్పారు. ప్రజలు దానికి యజమానులని, నష్టాలు వచ్చినా వారికేనని, సామాజిక సేవకు సంబంధించిన రంగాల్లో వస్తున్న నష్టాలను ఇతర రూపాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని భర్తీ చేయాలని.. నష్టాలు వస్తే ప్రభుత్వానికి ఏం నొప్పి.. అది ప్రజల పెట్టుబడి అని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ఆగదు ఈ ఇ-సైకిల్