Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ నేవీ సోల్జర్ శాంతి చంద్ర నటించిన డర్టీ ఫెలో రివ్యూ

డీవీ
శుక్రవారం, 24 మే 2024 (16:22 IST)
Shanti Chandra Dirty Fellow
నటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: రామకృష్ణ యస్‌. ఎడిటర్‌ : జేపీ, సంగీతం: డాక్టర్‌. సతీష్‌ కుమార్‌.పి, నిర్మాత: జి.యస్. బాబు, దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి
 
డాక్టర్లు, సైంటిస్టులు సినిమా హీరోలుగా మారడం మామూలే. కానీ ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా మారి తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు ముందుకు వచ్చి  ‘డర్టీ ఫెలో’ లో నటించారు. నెగెటివ్ టైటిల్ అయినా ఏదో పాజిటివ్ వుందనే హింట్ ను ప్రమోషన్స్ లో కలిగించారు. నేడే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ
సెటిల్‌మెంట్స్‌ చేస్తూ మాఫియా డాన్‌ గా ఎదిగిన  జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) మిత్రులు. రానురాను ఆలోచనలు మారి  జేపీని లేపేస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని శంకర్‌ నారాయణ ప్లాన్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత తను తప్పించుకునే క్రమంలో శంకర్‌ నారాయణ కొడుకు చనిపోతాడు.  ఇది జీర్ణించుకోలేని శంకర్‌ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. కోపంతో, ఆవేశంతో  నీ కొడుకు శత్రు అలియాస్‌ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని నేనే చంపేస్తానని జెపికి శంకర్ నారాయణ వార్నింగ్ ఇస్తాడు.
 
ఆ తర్వాత కొన్ని సినిమాటిక్ సంఘటనలు జరిగాక  సిద్దు పేరుతో (శాంతి చంద్ర) ఓ గూడెంలో కనిపిస్తాడు. పూజారి ఇంట్లో వుంటూ అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు.  పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది.  ఆ ఊరికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన పనిమీద చిత్ర (సిమ్రితి) వస్తుంది.  ఆ ఊరిలో శంకర్ నారాయణ మనిషి పోతురాజు పెద్ద దిక్కు. తప్పులు కూడా చేస్తుంటాడు.  అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. ఆ తర్వాత ఏమయింది? తన  మనిషిని చంపస్తే శంకర్ నారాయణ  ఊరుకున్నాడా? ఏమి చేశాడు. తర్వాత మలుపు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
 
ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర మాఫియా నేపథ్యం, ఓ గూడెం కథను ఎంచుకోవడం విశేషంగా వుంది. దేశంలో శత్రువుల బయటకాదు లోపలే వున్నారనేలా కథ అంతర్లీనంగా అనిపిస్తుంది. అయితే ఇటువంటి కథలు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. డర్టీ ఫెలో కూడా కొత్తదేమీ కాదు. కేవలం కటుుంబ బంధాలు, ఎమోషన్స్ కొత్తగా దర్శకుడు డీల్ చేశాడు. కథనాన్ని దర్శకుడు బాగా చూపించాడు. 
 
మొదటి భాగంలో యాక్షన్‌, ఎమోషన్స్‌, రొమాన్స్‌తో సాపీగా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్‌ సాంగ్‌... హీరోయిన్లతో రొమాన్స్‌ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే ఆసక్తిని కలిగించాడు.  
 
ఇంటర్వెల్‌ ముందు చిత్ర పాత్ర ఇచ్చే ట్విస్ట్‌ సరికొత్తగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో మాఫియా డాన్‌ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. స్విమింగ్‌ ఫూల్‌ సన్నివేశం బాగా డీల్ చేశాడు.  క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో కనుక దర్శకుడు మరింత కొత్తగా రాసుకుంటే బాగుండేది. బాలీవుడ్ లో మాఫియా కథలు చాలా వచ్చాయి. వాటిని మరిపించేలా తగు జాగ్రత్త తీసుకుంటే సినిమా మరోలా వుండేది.
 
నటనాపరంగా పాత్రల్లో రెండే వేరియేషన్స్ శాంతి చంద్ర చక్కగా చూపాడు. యాక్షన్, రొమాన్స్ లో కూడా బాగా నటించాడు. స్టైల్‌, యాక్షన్‌ తో మాస్‌ ఆడియన్స్‌ మెప్పించాడు. నాగి నీడు లెంగ్తీ పాత్ర చేశాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ గ్లామర్ గా కనిపించారు. ఆయా పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది.
 
సాంకేతికపరంగా సినిమాటోగ్రఫీ, సంగీతం, నేపథ్య సంగీతం కథానుసారంగా సాగాయి. నిర్మాణ విలువలు బాగున్నా ఈ సినిమా మాస్ యాక్షన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. మాఫియా నేపథ్యంలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం దర్శకుడు చేసినట్లనిపించింది. చిన్నపాటి లోపాలను సరిద్దుకుంటే మరింతగా రాణిస్తాడు.
 రేటింగ్‌ 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments