Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Rahul Vijay  Shivani Rajasekhar

డీవీ

, శనివారం, 18 మే 2024 (10:00 IST)
Rahul Vijay Shivani Rajasekhar
నటీనటులు: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, తనికెళ్ళ భరణి, అభినయ, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు
సాంకేతికత:  సంగీతం : కళ్యాణ్ మాలిక్, మహేష్ దత్తా, లక్ష్మి నవ్య, దర్శకత్వం: మణికాంత్ గెల్లి. ఆహాలో.. స్ట్రీమింగ్ అవుతోంది.
 
కోట బొమ్మాళి జంట రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ మరోసారి కలిసి నటించిన చిత్రం విద్య వాసుల అహం. టైటిల్ లోనే కథ నేపథ్యం తెలిసేలా దర్శకుడు చెప్పేశాడు. ఆహా లో ప్రసారం అవుతున్న ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
వాసు (రాహుల్ విజయ్) మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. తనకు పెండ్లి మీద యావ వుండదు. ఇప్పటి  ట్రెండ్ కు తగిన ఆలోచనలు.  అదే తరహాలో విద్య (శివానీ) వుంటుంది. ఇద్దరి కుటుంబాలలలో పెండ్లి చేసుకోమని చెబితే ఎవరికి వారు కెరీర్ మీద ఫోకస్ అంటూ  ప్రొలాంగ్ చేస్తుంటారు. ఇద్దరికీ తగినంత ఇగో వుంటుంది.
 
అలాంటి ఇద్దరూ ఓసారి గుడిలో విన్న ప్రవచనాలతో అసలు పెండ్లి ఎందుకు చేసుకోవాలో అర్థమై ఇద్దరూ తమ పెద్దలకు పెండ్లి చేసుకుంటామని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. పేరయ్య ద్వారా సంబంధాలు కుదిరి జంట అవుతారు. కానీ మొదటి రోజే ఇద్దరి ఇగోలవల్ల ఎడమొహం పెడమొహంగా వుంటారు. అది కాస్త మరింత పెరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు ఎటువైపు మలుపు తిరిగాయి. తాము చేస్తుంది కరెక్టే అనుకున్న వారు ఆ తర్వాతైనా మారారా? దానికి పరిస్థితులు ఏమి చేశాయి? అనేవి మిగిలిన సినిమా.
 
సమీక్ష: 
టైటిల్ లో చెప్పినట్లే ఇద్దరూ ఈనాటి యూత్ కు ప్రతినిధుల్లా వుంటారు. కెరీర్ అంటూ పెండ్లికి దూరమయ్యే దగ్గరనుంచి పెండ్లయ్యాక వారి మధ్య చిన్నచిన్న అపార్థాలు తగాదాలు అనేవి చూడ్డానికి సరదాగా అనిపిస్తాయి. వీరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. గతంలో కోట బొమ్మాళి చేసినా అందులో ఇద్దరూ కలవరు. కానీ ఇందులో చక్కటి జంటగా అలరిస్తారు. 
 
ఇక అవసరాల శ్రీనివాస్ విష్ణువుగా, అభినయ లక్మీదేవిగా, శ్రీనివాస రెడ్డి.. నారదుడిగా నటించిన ఆసక్తికలిగేలాచేశారు. అయితే ఇలాంటి కథతో కొత్తదనం ఏమీ లేకపోయినా కథనం మాత్రం మరింత ఆసక్తిగా నడిపితే బాగుండేది. ఎందుకంటే కొన్ని సీన్లు రొటీన్ సినిమా తరహాలో గోచరిస్తాయి. ఈ సినిమా ఓటీటీలో విడుదలకావడం పెద్ద ప్లస్ అవుతుంది. ఇటువంటి భావాలున్న జంటలు బయట చాలా మంది వున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవడంతో ఆదాయం, ఖర్చుల విషయంలో చిన్నపాటి అపోహలు రావడం సహజమే. దాన్ని కొన్ని సన్నివేశాల్లో చక్కగా చూపించాడు. 
 
సాంకేతికంగా చూస్తే, అఖిల్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతపరంగా నేపథ్య పరంగా కళ్యాణ్ మాలిక్ బాణీలు, బీట్ లు సింక్ అయ్యాయి. ఎడింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా వున్నాయి. ఇలాంటి సినిమాలు ఇప్పటి ట్రెండ్ చూడతగ్గ సినిమా.
 రేటింగ్: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?