Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

Advertiesment
Rahul Vijay  Shivani  Mahesh Dutta  and others

డీవీ

, బుధవారం, 15 మే 2024 (17:56 IST)
Rahul Vijay Shivani Mahesh Dutta and others
మహేష్ దత్తా, లక్ష్మి నవ్య నిర్మాతలుగా వస్తున్న విద్య వాసుల అహం మే 17న ఆహలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి మనికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. రాహుల్ విజయ్, శివాని వీరిద్దరూ విద్య వాసులుగా ఏ మాత్రం వారి అహాన్ని తగ్గించుకోకుండా ఎలా పెళ్ళైన కొత్త కాపురాన్ని లీడ్ చేస్తున్నారు, చివరికి ఆ ఈగోస్ నుండి ఎలా బయటకి వచ్చారు అనే కథతో, ఇంటరెస్టింగ్ టైటిల్ తో “విద్య వాసుల అహం” వివాహం అని క్రియేటివ్ గా వచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు,

కాప్షన్ కూడా లాంగ్ లాంగ్ ఈగో స్టొరీ అని కథలో క్యారక్టర్లకి తగట్టుగా పెట్టి మన ముందుకు వచ్చి, ట్రైలర్ విడుదల చేశారు, అనూహ్యమైన స్పందన లభించింది. రాహుల్, శివాని పెర్ఫ్ర్మన్స్ అని అందరూ మెచ్చుకుంటున్నారు, సమ్మర్ లో మంచి రిలాక్సేషన్ ఇచ్చే సినిమాలా ఉంది అని, హాట్ సమ్మర్ లో కూల్ హిట్ అని నేటీజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయ సమహవేశంలో  
 
డైరెక్టర్ మనికాంత్ గెల్లి మాట్లాడుతూ: కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకీ స్క్రిప్ట్ రాయడం వలెనే నేను సినిమా చెయ్యగలిగాను, ఈ సినిమాకి సోల్ మొత్తం మ్యూజిక్, కళ్యాణీ మాలిక్ గారు 4 పాటలని నాలుగు విధాలుగా కంపోస్ చేశారు. స్పెషల్లీ పెళ్లి తరవాత పాట నాకు చాలా ఇష్టం. నా డైరెక్షన్ డిపార్టుమెంటుకి థాంక్స్ అండి, నాదేముంది షూట్ చేసి వెళ్ళిపోతాను, మిగతా అన్ని వర్క్స్ వాళ్ళే చూసుకుంటారు. ఈ మే 17th న మీరు థియేటర్స్ కి వెళ్ళాలిసిన అవసరం లేదు అండి, ఎటువంటి అహం లేకుండా మేమే మీ ఇంటికి వస్తున్నాం, ఆహా లో తప్పకుండా చూడండి.  
 
హీరో రాహుల్ మాట్లాడుతూ: ఇదొక చిన్న క్యూట్ ఈగోస్ ఉండే ఫన్ ఫిలిం. సరదాగా హాయిగా సమ్మర్లో ఇంట్లో AC వేసుకుని ఆహలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా. కొత్తగా వచ్చే ప్రతి యాక్టర్ కి లైఫ్ లో కొన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలా నాకు కూడా వెంకటేష్ గారిలా ఫ్యామిలీ స్టోరీస్ చెయ్యాలని ఉంటుంది, ఒక రోజు ఫ్లైట్ లో ఉన్నప్పుడు, మనికాంత్ కాల్ చేసి, పీడిఎఫ్ సెండ్ చేశాడు, టైటిల్ చాలా గమ్మత్తుగా అనిపించింది. అప్పటికప్పుడు చదివి కథ నచ్చి ఒకే చెప్పేశాను. 
 
శివాని మాట్లాడుతూ: 2 సంవత్సరాల నుండి ఈ టీంతో అనుబంధం ఉంది, ఆహాలో ఆల్రెడీ కోట బొమ్మాలి వచ్చింది. ఇప్పుడు నా విద్య వాసుల అహం కూడా ఆహా లోనే వస్తుంది, నాకు నిజంగా ఆహ ఒక లక్కీ ప్లాట్ఫారం. నాకు మనికాంత్ కథ చెప్పినప్పుడు హీరో ఎవరని అడిగాను రాహుల్ విజయ్ అన్నారు, రాహుల్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు, రాహుల్ మంచి రైటర్ కూడా, రాహుల్ ఒకే చేసాడు అంటే కథ బాగుంటుంది అని అర్ధమైంది, నేను కూడా ఒకే చేశాను, ఈ కథ ఒప్పుకున్న 6 డేస్ కి కోట బొమ్మాలి ఒకే అయ్యింది, అలా లాస్ట్ రెండు సంవత్సరాలుగా రహుల్తోనే వర్క్ చేశాను. ఏ మాత్రం ఈగో లేని వ్యక్తి రాహుల్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్