Webdunia - Bharat's app for daily news and videos

Install App

సందేశాత్మ‌కంగా తెర‌కెక్కించిన రెడ్డిగారింట్లో రౌడీయిజం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (21:06 IST)
Reddygarintlo rowdyiszam poster
రెడ్డిగారింట్లో రౌడీయిజం టైటిల్‌లోనే ఆస‌క్తిని క‌లిగించిన ఈ చిత్రంలో ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. మామ‌గారింట్లో అల్లుడి రౌడీయిజం ఏమిట‌నేది క‌థాంశ‌మ‌ని విడుద‌లకు ముందే చెప్పేశాడు. ఇందులో ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వ‌ర్ష హీరోయిన్స్‌. సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై  కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మించినఈ చిత్రానికి ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ శుక్ర‌వార‌మే విడుద‌లైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
శివ (ర‌మ‌ణ్).ఊళ్ళో అల్లరి చిల్లరగా స్నేహితులతో సరదాగా తిరిగే  యువకుడు. తండ్రి (జూనియర్ బాలకృష్ణ) ఎంత చెప్పినా డిగ్రీ కంప్లీట్ చేయకుండా  ప్రేమ పేరుతో తిరుగుతూ ఉంటాడు. అలా  తన క్లాస్ మేట్ అయిన సంధ్య (ప్రియాంక రౌరీ)ని ప్రేమిస్తాడు. ఈమె తండ్రి ఊరిపెద్ద‌ ప్రతాప్ రెడ్డి.(వినోద్ కుమార్). అసలే ప్రేమ పెళ్ళిళ్లకి, కులాంతర వివాహాలంటే రగిలిపోయే ప్రతాప్ రెడ్డి.  వీరి వివాహానికి ఒప్పుకున్నాడా? అసలు సంధ్య  శివని నిజంగానే ప్రేమించిందా? ఆ త‌ర్వాత ఎటువంటి ప‌రిణామాలు జ‌రిగాయ‌నేది మిగిలిన సినిమా.
 
 విశ్లేషణ: 
కులాంతర వివాహాలుపై సినిమాలు చాలానే వ‌చ్చాయి. త‌న‌కు తెలిసిన క‌థ‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు అల్లిన విధానం ప‌ర్వాలేద‌నిపిస్తుంది.  రొమాన్స్, యాక్షన్ పార్ట్ ని సరైన మోతాదులో వెండితెరపై చూపించగలిగితే క‌చ్చితంగా ఆద‌ర‌ణ పొందుతోంది. అందుకే చాలా మంది నిర్మాతలు ఇలాంటి సబ్జెక్టుని ఎంచుకుని మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యే డెబ్యూ హీరోలు కూడా ఇలాంటి కథలనే సెలెక్ట్ చేసుకొని తమలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు.  
కొత్త త‌రం కూడా  'రెడ్డిగారింట్లో రౌడీయిజం' అనే ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సొంతం. చేసుకుంది. కులం, మతం కంటే... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప మానవత్వం అని చాటి చెప్పే సినిమా ఇది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులం పేరుతో ఆటవికంగా మనుషులను అంతమొదించడం  నిమ్న కులాల వారిని అంటరాని వారిగా చూడటం చూస్తూనే ఉన్నాం. ఆలాంటి  సున్నితమైన సబ్జెక్టును తీసుకుని... వాటికి కమర్షియల్ విలువలు జోడించి... ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా సినిమాని తెరకెక్కించారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
న‌ట‌నాప‌రంగా హీరో ర‌మ‌ణ్ త‌న‌కిష్ట‌మైన జాబ్ కాబ‌ట్టి బాగానే చేశాడు. పాత్ర‌లో కాస్త ప‌రిణితి క‌నిపిస్తుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ని ఎలా మెప్పించాలో  అలా అలరించారు.  పాటలు, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో  ఎనర్జిటిక్ గా నటించారు. ఇందులో నలుగురూ హీరోయిన్లు. ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష పోటీ పడి యువ‌త‌ను  ఆయకట్టుకున్నారు. సీనియర్ హీరో వినోద్ కుమార్ మరోసారి తన మార్కు నటన విలనిజంతో మెప్పించారు. రచ్చ రవి, జూనియర్ బాలకృష్ణ అండ్ బ్యాచ్ కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో జూనియర్ బాలకృష్ణ బాగా ఆకట్టుకున్నాడు.
 
టెక్నిక‌ల్‌గా చెప్పాలంటే,  ఎ.కె. ఆనంద్‌ సినిమాటోగ్ర‌ఫీ రిచ్‌నెస్ కనిపించింది.   హీరో ఎలివేషన్‌తోపాటు హీరోయిన్ల అందాలను  కెమెరాలో బంధించారు. కమర్షియల్ ఎంటర్టైనర్ ని దర్శకులిద్దరూ ఎం. ర‌మేష్‌, గోపి బాగా డీల్ చేశారు. ఒక డెబ్యూ హీరోని ప్రేక్షకులు మెచ్చేలా వెండితెరపై అన్ని విధాలుగా ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు. సున్నితమైన కథను ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాంగా మలచడానికి ట్విస్టులతో రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. శ్రీ‌వ‌సంత్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఒకే. మ‌హిత్ నారాయ‌ణ్‌ స్వరపరిచిన సంగీతం బాగుంది.  శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి ల ఎడిటింగ్ ఇంకాస్త కృస్పీగా ఉంటే బాగుండేది. అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ని మెప్పిస్తాయి నిర్మాత‌ కె.శిరీషా ర‌మ‌ణారెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని ఎంతో ఉత్తమమైన నిర్మాణ విలువలతో నిర్మించారు. అయితే అక్క‌డ‌క్క‌డా కొన్ని లోపాలున్నా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో కొట్టుకుపోతాయి.
రేటింగ్: 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments