Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడుగా ఫుల్ బాటిల్ ప్రారంభం

Advertiesment
Satyadev
Satyadev
విలక్ష‌ణ‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న స‌త్య‌దేవ్ హీరోగా రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎస్‌.డి. కంపెనీ నిర్మాణంలో స‌ర్వాంత్ రామ్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఫ‌న్ రైడ‌ర్ ‘ఫుల్ బాటిల్’. ఫన్, ఫాంటసీ సహా అన్ని ఎలిమెంట్స్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
 
ఈ సినిమా మేక‌ర్స్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ యూనిక్‌గా ఉంది. సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆస‌క్తిని క‌లిగించేలా ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. స‌రికొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ షూటింగ్‌ను వీలైనంత త్వ‌రగా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.
 
సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి సంతోష్ కామిరెడ్డి ఎడిట‌ర్‌. న‌వీన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడి పందేల నేప‌థ్యంలో బ‌రి చిత్రం