పడి పడి లేచె మనసు... పడిపోతుందా? లేస్తుందా? ప్రీమియర్ టాక్

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:20 IST)
జస్ట్ అల్లు అర్జున్ అలా టచ్ చేస్తే చాలు... సినిమా హిట్టవుతుందన్న సెంటిమెంటుతో మొన్న ప్రి-రిలీజ్ వేడుకకు బన్నీని ఆహ్వానించాడు శర్వానంద్. స్టేజి మీద బన్నీ మాట్లాడుతూ... నేను టచ్ చేస్తే సినిమా హిట్ అనే టాక్ వుంటే నాకు నేను టచ్ చేస్కుంటూ వుంటానని సెటైర్ వేశాడు. దాన్నలా వుంచితే శర్వానంద్- సాయిపల్లవి నటించిన పడిపడి లేచె మనసు ఈరోజు విడుదలైంది. ఐతే అంతకుముందే ప్రీమియర్ టాక్ షో వచ్చేసింది.
 
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వున్నాయి. ఈ చిత్రంలో సూర్య పాత్రలో శర్వానంద్ నటించాడు. తను చాలా సింపుల్‌గా నటించేశాడు. సాయి పల్లవి నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇద్దరి మధ్య కెమస్ట్రీ బాగా కుదిరింది, ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో బాగా హత్తుకునేట్లు చేసారు. ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు కొన్నిచోట్ల ఆడియెన్స్ నెక్ట్స్ ఏం జరుగబోతుందన్నది ముందుగానే పసిగట్టేస్తారు. 
 
ఇలాంటివి చిత్రానికి కాస్త మైనస్ అనే చెప్పాలి. ఇక చిత్రంలో ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోలేం. ఐతే ప్రేమికుల మధ్య తలెత్తే సమస్యలు, చిన్నచిన్న విషయాలను బాగా చూపించారు. పాటలు అద్భుతంగా వున్నాయి. చిత్రం ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగితే సెకండాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. మొత్తమ్మీద లవర్స్ కి మంచి రొమాంటిక్ చిత్రం అవుతుంది. మరి ఈ పడిపడి లేచె మనసు ప్రేక్షకుల మనసులో పడుతుందో లేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments