Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

దేవీ
శుక్రవారం, 20 జూన్ 2025 (15:11 IST)
Kubera poster
నటీనటులు: ధనుష్- అక్కినేని నాగార్జున- రష్మిక మందన్నా- జిమ్ సర్భ్- దలిప్ తాహిల్- సునైనా- హరీష్ పేరడి- షాయాజి షిండే-భాగ్యరాజ్ తదితరులు
 
సాంకేతికత: ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, రచనా సహకారం: చైతన్య పింగళి నిర్మాతలు: సునీల్ నారంగ్- పుస్కుర్ రామ్మోహన్ రావు రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల 
 
ధనుష్.. నాగార్జున.. శేఖర్ కమ్ముల కాంబినేషన్‌తో సినిమా అనగానే కొంత ఆసక్తి నెలకొంది. రెండేళ్ళనాడు ప్రారంభించిన ఈ సినిమా నేడు థియేటర్లో విడుదలైంది. శేఖర్ కమ్ముల చాలా కాలం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ఏదో ప్రత్యేకత వుంటుందని అర్థమయింది. ట్రైలర్ విడుదల తర్వాత విషయం వున్న కథలా అనిపించింది. మరి అదెలా వుందో చూద్దాం.
 
కథ:
తిరుపతిలో రోడ్డుమీద అడుక్కునే బిచ్చగాడు దేవా(ధనుష్). తనో అనాథ. బిచ్చగాళ్ళంటే ఎనలేని ప్రేమ. తామూ మనుషులమే అన్న భావన అతనిలో వుంటుంది. మరోవైపు సిబిఐ అధికారి హోదాలో నీతికి నిలబడినందుకు జైలు పాలవుతాడు దీపక్(నాగార్జున). ఇంకోవైపు మల్టీ నేషనల్ కంపెనీకి చెందిన బిలియనీర్ నీరజ్ చోప్రా(జిమ్ సర్భ్) ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల రూపాయల ఆయిల్, గ్యాస్‌ను తనకు దక్కేలా నెం.1 బిజినెస్ మేన్‌గా ఎదగాలని ప్రభుత్వాన్ని కొనేస్తాడు. అయితే ఆ పనిని తాను చేయకుండా జైలులో వున్న దీపక్‌ను విడిపించి అతనితో చేయిస్తాడు.

దీపక్ ప్లాన్ ప్రకారం నలుగురు బెగ్గర్లు కావాలి. అలా ధనుష్‌తో పాటు మరో ముగ్గురుని తీసుకువచ్చి వారి పేరుతో వేల కోట్లరూపాయల కొత్త వ్యాపారం నిర్వహించి దాన్ని వైట్ మనీ చేయాలనుకుంటారు. అలా ముగ్గురితో సాఫీగా జరుగుతుండగా, ధనుష్ దగ్గరకు వచ్చేసరికి చిన్న మిస్టేక్‌తో బెడిసి కొడుతుంది. దాంతో తను పారిపోతాడు. ఇంతకీ దేవా వీళ్లకు దొరికాడా లేదా? వాళ్ల ప్లాన్ ఏమైంది? వీటికి సమాధానమే సినిమా.
 
సమీక్ష:
ఒకప్పుడు లీడర్ అనే సినిమాతో వేల కోట్ల రూపాయల స్కామ్‌ను ఏవిధంగా పొలిటీషియన్ సంపాదిస్తాడు. దాన్ని ఏవిధంగా ప్రజలకు చేరుతుంది అనే పాయింట్‌తో తీసిన శేఖర్ కమ్ముల ఈసారి అటువంటి స్కామే కానీ సరికొత్తగా ఇంటర్నేషన్‌లో జరిగే బెగ్గర్ మాఫియా అనే అంశాన్ని తీసుకున్నాడు. ఇది ప్రేక్షకుడికి కొత్తగా అనిపించవచ్చు కానీ ప్రపంచంలో ఇటువంటి స్కామ్‌లు సైలెంట్‌గా జరుగుతున్నాయనేది ఆంగ్ల పత్రికల్లో చదివినదిగా అనిపిస్తుంది. బెగ్గర్ల మాఫియాతో డబ్బు సంపాదించవ్చనే కోణంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కుబేర అనేది డిఫరెంట్ అంశం.
 
పెట్టుబడిదారుడు తన ఇగో కోసం, పరపతి కోసం అడ్డువచ్చిన ఎంతమందినైనా అడ్డు తొలగిస్తాడనేది ఇందులో తనదైన శైలిలో దర్శకుడు చూపించాడు. థియేటర్లోకి అడుగు పెట్టే ప్రేక్షకులను ఇది సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. మొదలైన తొలి సన్నివేశం నుంచి తెరపై జరిగే ప్రతి విషయం ఆసక్తికరంగా అనిపిస్తూ తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రేకెత్తిస్తూంది.
 
దాదాపు మూడు గంటల నిడివి గల ఈ సినిమా మొదటి భాగం చాలా ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది. ఇక రెండో  భాగం వచ్చేసరికి పూర్తిగా ధనుష్ పాత్ర ఎత్తుకి పైఎత్తులు, అతనికి రష్మికకు వున్న రిలేషన్ ఏమిటి అనేది కొనసాగుతుంది. గతంలో దర్శకుడు చెప్పినట్లు కొన్ని సన్నివేశాలు  వావ్ '' అనిపించేలా వుంటుంది.
 
ఇక సంభాషణల పరంగా నీ చావ్ నువ్వు చావ్.. అంటూ. సందర్భానుపరంగా సాగేవి, ఇతర సన్నివేశాల్లో జరిగే సంభాషణలు చాలా పొందికగా వుంటాయి. కేంద్ర మంత్రులు, ప్రభుత్వాధినేతలు పెట్టుబడిదారీ చేతుల్లో ఎలా కీలు బొమ్మలుగా మారతారు అనేది చూపిస్తూ, వారికి ఎదురుతిరిగితే మట్టి కరుస్తారనేది కూడా  చూపించాడు. నీతి గల ఆఫీసర్ నాగార్జున అవినీతి గల వారితో చేతులు కలిపితే తర్వాత జరిగే పర్యవసానాలతో మథనపడే విధానం బాగా చూపించాడు. 
 
బెగ్గర్‌గా ధనుష్ చాలా కాజువల్‌గా నటించేశాడు. అతని ఆహార్యం కూడా బాగా సూటయింది. డంప్ యార్డ్‌లో సాగే సన్నివేశాలు సహజంగా వున్నాయి. విలన్‌ను కూడా తిరిగి అక్కడికే తీసుకువచ్చి చేసే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్. గతంలో కొన్నిసార్లు అనాధలుగా కొందరు చనిపోవడం, బెగ్గర్లు మాయం కావడం వంటి సన్నివేశాలు కొన్ని చోట్ల ప్రసారం అయ్యాయి. ఈ సినిమా చూశాక ఇలాంటి సంఘటనలు జరగడంతో వల్లేనేమో అనిపించేలా వున్నాయి.
 
ఎంతమందిని చంపినా తాను నెంబర్.1 అవ్వాలనుకునే క్రమంలో హెల్ప్ చేస్తే తిరుపతి దేవుడికి లక్షల్లో బంగారు ఆభరాలు చేయిస్తానని మొక్కు అనండి, లంచం అనండి.. ఇటువంటి డైలాగ్‌లు వింటుంటే కూడా కోట్ల రూపాయల విలువచేసే డైమండ్స్ శ్రీవారికి దానంగా గుర్తు తెలియని భక్తులు ఇవ్వడం వంటివి విన్నాం. అది ఇలాంటిది కాకపోయినా ఏదో రకంగా కోట్ల రూపాయలు రావాలని అనుకోవడం కూడా ఆలోచింపజేస్తుంది. 
 
రష్మిక పాత్ర కాస్త ఎంటర్టైన్ చేయిస్తుంది. ప్రేమించినవారు మోసం చేస్తే రైల్వేస్టేషన్లో వుంటే అక్కడ ధనుష్ కలవడం, ఆ తర్వాత వీరి జర్నీ ముగింపు వరకు సాగడం కాస్త ఆటవిడుపుగా వుంటుంది. దర్శకుడు కథను పకడ్బందీగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నించాడు. హీరో అయినా.. విలన్ అయినా.. ఓ ప్రత్యేక పాత్ర అయినా.. అందులో ఇమిడిపోయాయి తప్ప ఏదీ కథను దాటి ప్రవర్తించదు. కేవలం ఇది శేఖర్ కమ్ముల సినిమా అని చెప్పగలం. కానీ ఎక్కడా క్లాసులు పీకకుండా.. విసుగు తెప్పించే సన్నివేశాలు లేకుండా.. థ్రిల్లర్ స్టయిల్లో ఈ సబ్జెక్టుని డీల్ చేశాడు.
 
గతంలో బిచ్చగాడు అనే సినిమా వచ్చింది . తల్లి సెంటిమెంట్‌తో తీశారు. ఇది తల్లి సెంటిమెంట్ అయినా సరికొత్త అంశంగా వుంటుంది. కాకపోతే బిచ్చగాడు కథనే మరోలా చెప్పాడు శేఖర్ కమ్ముల. మరోవైపు చూస్తే లీడర్‌కు సీక్వెల్‌గా కూడా అనుకోవచ్చు. ముగింపులో కుబేర సీక్వెల్ చేయవచ్చనే భ్రమ కల్పించాడు కూడా.
 
పాత్రకు సంబంధించి చిన్న చిన్న విషయాలను కూడా దర్శకుడు తీసుకున్న కేర్ బాగుంది. సమీర పాత్రలో రష్మిక కూడా రాణించింది. దేవిశ్రీ ప్రసాద్ తన నేపథ్యం సంగీతంతో వైవిధ్యమైన సినిమాగా చూపించాడు. కథను అనుసరించి తన శైలిని పక్కన పెట్టి అతను డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలామంది దర్శకులు రాజకీయ వ్యవస్థ, దేశం గురించి చెప్పే విధానంలో ఒకరకంగా చూపిస్తే, ప్రజల వనరులను దోచుకునే పెట్టుబడిదారులు ప్రతి రాష్ట్రంలోనూ వున్నారు. ఆంధ్రలో గ్యాస్, ఆయిల్ వనరులను దక్కించుకున్న అందరికీ తెలిసిన సంస్థ గుర్తుకు వస్తుంది. అందుకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలు గుర్తుకు వస్తాయి. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రైవేట్ పరంగా చేయడం ఎంత గ్రౌండ్ వర్క్ జరుగుతుందో శేఖర్ కమ్ముల తన మైండ్‌తో ఆలోచించి తీశాడు. అభినందనీయమైన సినిమా ఇది.
 
 రేటింగ్- 3.25/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments