Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫస్ట్ లవ్ గురించి ఓ సాథియాలో ఎలా చెప్పారంటే.. రివ్యూ రిపోర్ట్

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (16:47 IST)
Aryan Gowra, Misty Chakraborty
నటీనటులు : ఆర్యన్‌ గౌరా, మిస్తీ చక్రవర్తి, దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారయణ, చైతన్య గరికపాటి, క్రేజి ఖన్నా, బుల్లెట్‌ భాస్కర్, అంబరీష్‌ అప్పాజి తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: ఈజె.వేణు, సంగీతం: విన్నూ వినోద్‌, నిర్మాత : సుభాశ్‌ కట్టా, చందన కట్టా, దర్శకత్వం: దివ్యభావన
 
పెద్ద హీరోల సినిమాలకు గ్యాప్ రావడంతో చిన్న సినిమాలు ఒకేరోజు 9దాకా విడుదల అయ్యాయి. అందులో ఓ సాథియా ఒకటి. విజయేంద్ర ప్రసాద్, డైమండ్ రత్నబాబు దగ్గర వర్క్ చేసిన దివ్యభావన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫస్ట్ లవ్ గురించి చెప్పే ప్రయత్నం అంటూ ముందే చెప్పిన ఈ సినిమాలో కొత్త  హీరో పరిచయం అయ్యాడు. మరి ఈరోజే విడుదల అయిన ఈ  సినిమా ఎలా ఉండే తెలుసుకుందాం.
 
కథ: 
అర్జున్ (ఆర్యన్ గౌరా) సాధారణ స్టూడెంట్. కాలేజీ లో బ్యాక్ లాక్స్ ఉన్నా ఆవారాగా తిరుగుతూ లవ్ కోసం తపించే కుర్రాడు. అలాంటి అర్జున్ లైఫ్ లో కీర్తి (మిస్తీ చక్రవర్తి) ప్రవేశిస్తుంది. తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఫస్ట్ లవ్ గురించి బాగా కలలు కంటాడు. లవ్ బాగా తలకు ఎక్కాక షడన్ గా కీర్తి కాలేజీ వదిలి వెళ్ళిపోతుంది. తండ్రి హితబోధ చేసాక గారేజ్ లో పనిచేసుకుంటున్న అర్జున్ కు కీర్తి గురించి తెలిసి ఆమె కోసం హైదరాబాద్ వస్తాడు. ఆమె చదువుతున్న కాలేజీలో జేరతాడు. ఆ తర్వాత కీర్తి కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అతనితోనే పెళ్లి అని తెలిసి డీలా పడతాడు అర్జున్. అసలు కీర్తి ఎందుకు ఇలాచేసింది. చివరికి అర్జున్ పరిస్థితి ఏమిటి అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష: 
ఓ సాథియా సినిమా కాలేజ్ లో చదివే వారి ఫస్ట్ లవ్. అందులో కుర్ర వయస్సులో ఉన్న ఆనందం, ఆకర్షణ, తెగింపు అన్ని ఉంటాయి. ఇది కొత్త కథేం కాదు. చిన్న ప్రేమ కథను ఎలా తీయెచ్చో తన శక్తిమేర ప్రయత్నించింది డైరెక్టర్ దివ్యభావన. ఆమె అనుభవాలు కానీ, పరిశీలనలో కానీ  కాలేజ్ ఎపిసోడ్స్‌తోనే ఫన్నీగా నింపేశారు. ఇందుకు సరైన డైలగ్స్ కూడా బాగా అమరాయి. ఆమెకు అనుకున్న కథ తీయడానికి  మంచి టీం దొరికింది. దాంతో ఉన్నంతలో బాగానే తీసారు.  సున్నితమైన ప్రేమకథను అంతకంటే సున్నితమైన కథనంతో మెప్పించే ప్రయత్నం అయితే చేసారు.
 
హీరో కొత్తవాడు అయినా బాగా యాక్ట్ చేసాడు. తనలో ఈజ్ ఉంది. కొన్ని మోడ్యూలేషన్స్ కొందరి హీరోలను గుర్తుచేస్తుంది. డైలాగ్స్ బాగానే చెప్పాడు. తన వాయిస్ పెక్కులర్ గా ఉండటంతో కొన్ని చోట్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. కేశాలంకరణ, ఆహార్యం ఇంకాస్త మెరుగ్గా చేసుకోగలిగితే స్టార్ వాడుతాడు. మిస్తీ చక్రవర్తి చిన్నదాన నీకోసం సినిమా తర్వాత చాలా  గ్యాప్ తర్వాత వచ్చినా కొత్తగా కనిపించింది. దేవీ ప్రసాద్, కల్పలత, ప్రమోదిని, అన్నపూర్ణమ్మ, శివన్నారాయణ పాత్రలు సహజంగా ఉన్నాయి. 
 
భాస్కర బట్ల సాహిత్యం వినసొంపుగా ఉంది. సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చాలా వినపొంపుగా ఉంది. బ్రేకప్‌ సాంగ్‌ బాగుంది. కెమెరామెన్‌ వేణు తన పనితనాన్ని చక్కగా చూపించాడు. కొన్నిచోట్ల వచ్చే ఎమోషనల్‌ సీన్స్, డైలాగ్స్‌ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌లవ్‌కి ఎంతో ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అది ‘ఓ సాథియా’ సినిమాలో చూపించారు దర్శకురాలు దివ్యభావన.
 
సున్నితమైన కథను ఆకట్టుకునేలా దివ్యభావన తీశారు. అయితే రొటీన్ ఫార్ములా గా చివరి వరకు హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ పురిగొల్పే సన్నివేశాలు ఉన్నా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసారు. అటు హీరో తండ్రి, తన  కొడుకు బాగు కోసం ఏ  విధంగా సలహా ఇచ్చి ధైర్యం చెప్పాడో, ఇక్కడ హీరోయిన్ మదర్ కూడా కూతురుకు సరైన బోధ చేయడం బాగుంది. మహిళగా ఈ సన్నివేశాల్లో దర్శకురాలు మార్కులు కొట్టారని చెప్పాలి. 
 
ఈసినిమాలో కెమెరా వర్క్, ప్రధాన తారాగణం, నిర్మాణ విలువలు బాగున్నాయి. అయినా పెద్ద స్టార్స్ లేకపోయినా బాగానే తీశారు. కెరీర్, ప్రేమ అనే విషయంలో యువతకు సరైన క్లారిటీ ఉండాలనే చెప్పిన ప్రయత్నం ఈ సినిమా. ముక్ష్యంగా అందరికి ఫస్ట్ లవ్ గుర్తు చేసే సినిమా. అందుకే తండ్రి పాత్రతో మేము వాటిని దాటి వచ్చాము రా. అని దేవీప్రసాద్ తో చెప్పించారు. అక్కడక్కడ రొటీన్ కథ అనిపించినా క్లీన్ సినిమా తీసినందుకు టీంను మెచ్చుకోవాల్సిందే. అందుకే సెన్సార్ కూడా ప్రశంశించారు. ఇలాంటి సినిమా కుటుంబంతో చుడొచ్చు. 
 రేటింగ్: 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments