Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబా పటేల్, దినేష్ తేజ్ నటించిన అలా నిన్ను చేరి ఎలా వుందంటే.. రివ్య్యూ

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (07:09 IST)
Heba Patel, Dinesh Tej, Payal
నటీనటులు: దినేష్ తేజ్, హెబా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు
సాంకేతికత.. సినిమాటోగ్రఫి: అండ్రూ,  మ్యూజిక్: సుభాష్ ఆనంద్, సాహిత్యం: చంద్రబోస్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్, దర్శకత్వం: మారేష్ శివన్, విడుదల...శుక్రవారం:10-11- 2023
 
కథ
 
గణేష్ (దినేష్ తేజ్)‌కు చిన్నతనంనుంచి  నాటకాల పిచ్చి. వైజాగ్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన గణేష్ తన స్నేహితులతో నాటకాలు వేస్తుంటాడు. ఫైనల్ గోల్ సినిమా దర్శకుడు అవ్వాలని. సిటీ నుంచి తన గ్రామానికి వచ్చిన కాలేజీ చదివే దివ్య (పాయల్ రాధాకృష్ణ)‌కు గణేష్ క్యారెక్టర్ నచ్చి ప్రేమిస్తుంది. కానీ గణేష్ తన గోల్ దర్శకుడు అవ్వాలనుందని లైట్ గా తీసుకుంటాడు. 
 
కూతురి విషయం తెలిసిన దివ్య తల్లి (ఝాన్సీ) తన కూతురుకు బలవంతంగా ఆ ఊరి మండలానికి చెందిన రాజకీయ నాయకుడికి (శత్రు) కి  ఇచ్చి పెండ్లి చేస్తుంది. పెంఢ్లికి వచ్చిన గణేష్ ను శత్రు తన అనుచరులతో చావుదెబ్బలు కొట్టిస్తాడు. దాంతో కోమాలోకి వెళ్ళిన శత్రు కోలుకున్నాడా? లేదా? మరి హెబ్బా పటేల్ పాత్ర ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
సమీక్ష
 
ఇది చక్కటి గ్రామీణ, పట్టణ వాతావరణంతో అల్లుకొన్న ప్రేమ కథ. ఇటువంటి కథలు ఇంతకు ముందు వచ్చినా నేపథ్యం కొత్తగా వుంది. గ్రామంలో వున్న యూత్ ఎలావుంటారు? వారి ఆలోచన విధానం ఎలా వుంటుంది? అనేది చూపించాడు. ఇక పట్టణం వచ్చాక అక్కడి పరిస్థితులకు అనుగుణంగా దినేష్ తేజ్ ఏవిధంగా వున్నాడు. హెబా పటేల్ అతనికి ఏ విధంగా అండగా ఉంది అనేది ఇప్పటి యూత్ కు కనెక్ట్ అయ్యేవిధంగా వుంది. ఫస్టాఫ్ కథంతా పాత ఫార్మెట్ లో వున్నా బోర్ అనిపించదు.
 
ఇక సెకండాఫ్ వచ్చేసరికి కమర్షియల్ అంశాలను జోడించి కథను నడిపిన తీరు బాగుంది.  లవ్ లో వుండగా వచ్చే పాటల్లో సాహిత్యం బాగుంది. సెకండాఫ్ లో గోల్ ను రీచ్ చేసే క్రమంలో చంద్రబోస్ రాసిన సాహిత్యం ఇన్ స్పైర్ గా వుంది. ఆ దశలో పబ్ సాంగ్ పక్కా ఊర మాస్ కోణంలో తీశారు. మధ్య మధ్యలో కొంత లాగ్ లా అనిపించినా ముగింపు లో ఆసక్తిని క్రియేట్ చేశాడు దర్శకుడు.  క్లైమాక్స్‌ను ముగించిన విధానం ఫీల్‌గుడ్‌గా ఉంది.
 
అభినయంగా చెప్పాలంటే పలు సినిమాల్లో పాత్రలు పోషించిన దినేష్ తేజ్ హీరోగా తను చేయగలనని నిరూపించుకున్నాడు. అతని ఆహార్యం, డైలాగ్ డెలివరీ బాగుంది.  డ్యాన్సులు, యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఎమోషనల్ సీన్లను పర్వాలేదు అనిపించేలా వున్నాయి. ఇక పాయల్ రాధాకృష్ణ గ్రామీణ యువతిగా బాగానే నటించింది. హెబ్బా పటేల్ గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. సినిమాను మంచి జోష్‌తో నడిపించేలా చేసింది. దినేష్ తేజ్ స్నేహితుడిగా  చేసిన నటుడు, హెబ్బా టీం లీడర్ చమ్మక్ చంద్ర, ఝాన్సీ ఇతర పాత్రలు  తమ పరిధి మేరకు నటించారు.
 
ఇటువంటి సినిమాకు కెమెరా మెన్ పనితనం కీలకం. అండ్రూ అందించిన సినిమాటోగ్రఫి   ఫ్రేమ్‌ను రిచ్‌గా మార్చింది. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ బాగుంది. కోడి బాయే లచ్చ పాట జోష్ పెంచింది.చంద్రబోస్ సాహిత్యం సినిమాను ఎమోషనల్‌గా మార్చింది. ఎడిటింగ్ గా చెప్పాలంటే పాటలు కుదించాల్సి వుంది. కొమ్మాలపాటి సాయి సుధాకర్, శ్రీధర్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి. కొత్తవారితెో సినిమా చేసి మంచి సినిమా తీశారనే ఫీల్ కలిగించారు.
 
తెలుగు సినిమాలలో వుండే వినోదం, ఎమోషన్స్,  మదర్ ఫాదర్ రిలేషన్స్, ముక్కోణపు ప్రేమకథ ఇవన్నీ కలగలిపి కుటుంబకథా చిత్రంగా మలిచారు. తొలి సినిమా అయినప్పటికీ కథను డీల్ చేసిన విధానం చూస్తే దర్శకుడి ప్రతిభ ఆకట్టుకొంటుంది. చిన్నపాటి లోపాలున్నా అవన్నీ పెద్దగా కనిపించవు. అయితే యూత్ కు ఓ సందేశాన్ని చక్కగా చూపారు.
రేటింగ్.. 2.75/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీలో రాష్ట్రపతి.. ప్రకృతిపై సుదీర్ఘ పోస్ట్.. సముద్ర తీరం వెంబడి నడుస్తున్నప్పుడు..?

పర్యావరణహితంగా వేడుకలు... ఉత్సవాలు చేసుకొంటే మేలు : ఉప ముఖ్యమంత్రి పవన్

ముంబైను ముంచెత్తిన కుంభవృష్టి... 6 గంటల్లో 300 మిమీ వర్షపాతం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కొత్త బస్సు సర్వీసులు -ఏసీ బస్సులు కూడా..!

డ్రంక్ అండ్ డ్రైవ్.. వివాహితను ఢీకొట్టి... ప్రియురాలి ఇంట్లో నక్కిన నిందితుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments