Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప తర్వాత స్థానంలో ఏకమ్... ఓటీటీలో మంచి రెస్పాన్స్

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (14:48 IST)
ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్ వంశీ.బిని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం "ఏకమ్". "ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్" అన్నది ఉప శీర్షిక. అమెజాన్ ప్రైమ్ లో లభ్యమవుతున్న ఈ చిత్రం ఉత్తమాభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం యువదర్శకుడు వరుణ్ వంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.  అమెజాన్ ప్రైమ్ లో మొదటి స్థానంలో ఉన్న "పుష్ప" సరసన సగర్వంగా సెకండ్ ప్లేస్ లో నిలిచి అందరి దృష్టి విశేషంగా ఆకర్షిస్తోంది.
 
 
అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన "ఏకమ్" కేవలం పదిహేను రోజుల్లో టాప్-2కి చేరి, మొదటి స్థానం కోసం "పుష్ప"తో పోటీ పడుతోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా... తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన "ఏకమ్" చిత్రానికి అమెజాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
 
 
చిత్ర దర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ, "ఏకమ్" చిత్రానికి అమెజాన్ లో రెండో స్థానం దక్కడం కలలా ఉంది... చాలా గర్వంగానూ ఉంది.  ఇంతవరకు తెలుగులో రాని యూనీక్ జోనర్ లో రూపొందిన "ఏకమ్" చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా వస్తుండడం మరీ సంతోషంగా ఉంది" అన్నారు.


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఇక్బాల్ అజ్మీ, మ్యూజిక్: జొస్ ఫ్రాంక్లిన్, ఎడిటర్: శ్రీనివాస్ తోట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్, సమర్పణ: బోయపాటి రఘు, నిర్మాతలు: ఎ.కళ్యాణ్ శాస్త్రి--పూజ.ఎమ్., శ్రీరామ్.కె., కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వరుణ్ వంశీ.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments