Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు "నన్నుదోచుకుందువ‌టే" ట్రైలర్ ఎలా ఉంది..?

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. టీజర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అద్భుతమ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (19:35 IST)
సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. టీజర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండడం... హీరో, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఫ్రెష్‌గా అనిపించింది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజ‌ర్‌గా సుధీర్‌బాబు న‌టించ‌గా..  అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది.  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రంపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మిస్తున్న నన్నుదోచుకుందువ‌టే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మేం ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందని ఆశించామో అంతకు మించిన క్రేజ్ వచ్చింది. మా టీం అందంరం చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్‌కి అంద‌రూ క‌నెక్ట్ అయ్యారు. స‌మ్మెహ‌నం లాంటి మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత సుధీర్‌బాబు నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌టంతో ప్రేక్ష‌కుల నుంచి అంచ‌నాలు భారీగా వున్నాయి. 
 
సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్ బాబు గారికి స్పెషల్‌గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్‌ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు తగ్గట్టే ప్రీ ప్రమోషనల్ టూర్‌కి వెళ్లొచ్చాం. ప్రేక్షకులు భారీగా తరలివచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నన్ను దోచుకుందువటే చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధమైంది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను. అలాగే ఈ చిత్రం ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దనే సంకల్పంతోనే సుధీర్‌బాబు కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. ఈ స్టోరీ చాలా ఫ్రెష్‌గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Recording Dances: పవన్ కల్యాణ్ అడ్డా.. ఆగని రికార్డింగ్ డ్యాన్స్‌లు

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments