Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందిన ‘సాహో’... ఇంత‌కీ సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (19:20 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడి అవుతోంది. ఇందులో భాగంగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి U/A సర్టిఫికెట్ పొందింది. తెలుగు సహా భారత దేశంలోని పలు ఇతర భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
 
మొత్తం 2 గంటల 51 నిమిషాల 52 సెకెన్ల నిడివి గల ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు, చాలా బాగుందంటూ సాహో యూనిట్‌ను అభినందించినట్లు సమాచారం. 
 
అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తోంది సాహో. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు!! స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది… అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్‌కి సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది. 
 
ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ప్రభాస్ కెరీర్లొనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేసింది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది పండ‌గ లాంటి సినిమా అని మాటిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఆగస్టు 30న సాహో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments