Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి వ‌స్తోన్న రామ్ చరణ్ 'విన‌య విధేయ రామ'

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (18:32 IST)
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `విన‌య విధేయ రామ‌`. డి. పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. 
 
భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. డిసెంబ‌ర్ 10 నుండి హైద‌రాబాద్‌లో భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీక‌రించ‌బోతున్నారు.
 
 ఈ సంద‌ర్భంగా అగ్ర‌ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - ``క్రేజీ కాంబినేష‌న్ మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో టైటిల్‌ను `విన‌య విధేయ రామ‌` అని అనౌన్స్ చేయ‌గానే చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన టీజ‌ర్‌ను ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
సినిమా విష‌యానికి వ‌స్తే.. టాకీ పార్ట్ పూర్త‌య్యింది. హైద‌రాబాద్‌లో భారీ సెట్‌ను వేసి అందులో డిసెంబ‌ర్ 10 నుండి ఓ సాంగ్‌ను పిక్చ‌రైజ్ చేయ‌బోతున్నాం. ఆల్రెడీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌గా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేస్తున్నాం అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments